Homeబిజినెస్Old Model Scooter: పాత మోడల్.. అయినా బెస్ట్ సేల్స్.. ఈ స్కూటర్ కు ఎందుకంత...

Old Model Scooter: పాత మోడల్.. అయినా బెస్ట్ సేల్స్.. ఈ స్కూటర్ కు ఎందుకంత ఆదరణ?

Old Model Scooter: రోజువారి అవసరాల కోసం ప్రస్తుత కాలంలో స్కూటర్ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి బైక్ కంటే స్కూటర్ చాలా కన్వీనెంట్ గా ఉంటుంది. సామాగ్రి తీసుకురావడానికి.. స్కూల్ డ్రాపింగ్ కోసం ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే స్టైలిష్ గా కూడా ఉండడంతో యూత్ సైతం దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ స్కూటర్ వేరియంట్ లో Honda ప్రత్యేకంగా నిలుస్తుందని అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన Activa ఆదరణ పొందుతోంది. అయితే దీనికి పోటీగా అనేక కంపెనీలు స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అయినా కూడా దీనికి డిమాండ్ తగ్గడం లేదని అనడానికి ఈ అమ్మకాలే నిదర్శనం. జనవరి నెలలో ఈ స్కూటర్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

స్కూటర్ కొనాలని అనుకునేవారు ముందుగా Honda Activa గురించి తెలుసుకుంటారు. ఎందుకంటే ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ సామాన్యులకు సైతం అనుగుణంగా ఉంటాయి. అయితే ఇటీవల మార్కెట్లోకి EV లు ప్రవేశించినా కూడా యాక్టివా పెట్రోల్ స్కూటర్కు ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది. ఎందుకంటే 2026 జనవరిలో ఈ స్కూటర్ 2,71,924, యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. ప్రతిరోజు వేల మంది దీనిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది జనవరిలో ఈ అమ్మకాలు 1,66,739 జరిగాయి. గతంలో కంటే ఇప్పుడు అమ్మకాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే ఏడాదిలో 38.62 శాతం వృద్ధి పెరిగినట్లు కనిపిస్తుంది. రోజురోజుకు దీనిపై మరింత ఎక్కువగా ఆసక్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

హోండా యాక్టివా లో ఉండే ఫీచర్స్ కు ఆకర్షితులై దీనిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి LED హెడ్ లాంప్స్, టెయిల్ లైట్స్ వాహనానికి అందాన్ని తీసుకొస్తాయి. అలాగే 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరింత స్మార్ట్ గా ఉండేలా చేస్తుంది. ఈ స్కూటర్ లో 109.51 CC పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 7.9 PS పవర్ ను అందిస్తుంది.9.05 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హోండా యాక్టివా 110, హోండా యాక్టివా 125 అనే రెండు మోడళ్లు మార్కెట్లో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి.

రోజువారి అవసరాలతో పాటు యూత్ స్టైల్ గా కనిపించేందుకు ఇది చాలావరకు ఉపయోగపడుతుంది. అలాగే మైలేజ్ విషయంలోనూ కన్వీనెంట్ గా ఉండడంతో ఉద్యోగులకు ఈ స్కూటర్ బెస్ట్ ఎంపిక అని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular