Ola Electric Bike : ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ స్కూటర్లను Gen 3 ప్లాట్‌ఫామ్‌పై సిద్ధం చేసింది. ఈ స్కూటర్ పరిధి 320 కి.మీ. వరకు ఉంటుంది. లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ MoveOS 5ని కూడా ప్రకటించింది. అదే సమయంలో… కంపెనీ తన రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లాంచ్ తేదీని కూడా ఆవిష్కరించింది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను గత సంవత్సరం విడుదల చేసింది. అలాగే, దాని ధరలను కూడా ప్రకటించారు, కానీ ఇప్పుడు కంపెనీ దాని డెలివరీ, ఇతర వివరాలను ఫిబ్రవరి 5న పంచుకునే అవకాశం ఉంది. ఈ బైక్ టెస్టింగ్ కూడా జరుగుతుంది.
ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రోడ్‌స్టర్ ఎక్స్ ఉత్పత్తి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారు. ఈ ఫోటో బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఉత్పత్తి శ్రేణి నుండి తీసుకున్నాం. భవిష్ షేర్ చేసిన ఫోటో, వీడియో క్లిప్‌లో ఒక మహిళ పిలియన్‌పై కూర్చుని బైక్ నడుపుతున్నట్లు చూడవచ్చు. రోడ్‌స్టర్ స్ట్రక్ఛర్ గురించి మాట్లాడుకుంటే.. దీనికి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ ఉంది. దీనిలో బ్యాటరీ ప్యాక్ ఇన్‌స్టాల్ చేశారు. బ్యాటరీ కింద, ఫుట్‌పెగ్‌ల చుట్టూ మోటారు ఉంటుంది. ఇది సాంప్రదాయ చైన్-డ్రైవ్ సిస్టమ్‌కు అనుసంధానించబడి ఉంటుంది.
ఆగస్టు 2024లో ప్రారంభించిన సమయంలో.. రోడ్‌స్టర్ X మూడు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో అందించబడుతుందని కంపెనీ వెల్లడించింది. అవి 2.5kWh, 3.5kWh, 4.5kWh. రోడ్‌స్టర్ X ధరలు రూ.74,999 నుండి ప్రారంభమై రూ.99,999 వరకు ఉంటాయి. రోడ్‌స్టర్ మోడల్ ధర రూ. 1.05 లక్షల నుండి ప్రారంభమై రూ. 1.40 లక్షల వరకు ఉంటుంది. రోడ్‌స్టర్ ప్రో ధర రూ.2 లక్షల నుండి రూ.2.50 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
రోడ్‌స్టర్ ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
రోడ్‌స్టర్ ప్రో అనేది అత్యుత్తమ మోడల్. దీని ధర 8kWh బ్యాటరీకి రూ.1,99,999, 16kWh బ్యాటరీకి రూ.2,49,999గా ఉంచబడింది. ఈ బైక్ కేవలం 1.2 సెకన్లలోనే 0 నుండి 40 వేగాన్ని అందుకుంటుందని చెబుతున్నారు. గరిష్ట వేగం గంటకు 194 కిలోమీటర్లుగా చెబుతున్నారు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 579 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ADAS వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించబడ్డాయి.
రోడ్‌స్టర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
రోడ్‌స్టర్ 2.5kWh బ్యాటరీ ధర రూ.1,04,999, 4.5kWh బ్యాటరీ ధర రూ.1,19,999, 6kWh బ్యాటరీ ధర రూ.1,39,999. ఈ బైక్ 2.2 సెకన్లలో 0 నుండి 40 వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 126 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 579 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి 7-అంగుళాల టచ్‌స్క్రీన్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని డెలివరీ వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభమవుతుంది.
రోడ్‌స్టర్ X ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ సిరీస్‌లో రోడ్‌స్టర్ X అత్యంత సరసమైన బైక్. దీని ధర 2.5kWh బ్యాటరీ రూ.74,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ 2.8 సెకన్లలో 0 నుండి 40 వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 124 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, 4.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉన్నాయి. దీని డెలివరీ కూడా వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభమవుతుంది.