https://oktelugu.com/

కంపెనీ సూపర్ ఆఫర్.. ఐడియా చెబితే రూ.5 లక్షలు..?

ప్రముఖ సంస్థలలో ఒకటైన ఎన్‌టీపీసీ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఒక్క ఐడియాతో ఏకంగా 5 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వేస్టేజ్‌ ను నూటికి నూరు శాతం ఉపయోగించుకునే ఐడియా ఇవ్వడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. పర్యావరణం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు వారి సలహాలు తీసుకోవడం ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2021 సంవత్సరం మే నెల 19వ తేదీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 24, 2021 / 07:15 PM IST
    Follow us on

    ప్రముఖ సంస్థలలో ఒకటైన ఎన్‌టీపీసీ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఒక్క ఐడియాతో ఏకంగా 5 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వేస్టేజ్‌ ను నూటికి నూరు శాతం ఉపయోగించుకునే ఐడియా ఇవ్వడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. పర్యావరణం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు వారి సలహాలు తీసుకోవడం ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం.

    2021 సంవత్సరం మే నెల 19వ తేదీ వరకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎవరైతే మంచి ఐడియా ఇస్తారో వారికి మొదటి బహుమతి కింద 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి సమయంలో వెలువడే వ్యర్థాలకు సొల్యూషన్ చెప్పడం ద్వారా ఈ డబ్బును పొందే అవకాశం ఉంటుంది. ఎన్‌టీపీసీ సంస్థకు మొత్తం 70 పవర్ స్టేషన్లు ఉండగా ఈ పవర్ స్టేషన్లలో 26 రెన్యూవబుల్ ప్రాజెక్టులు, 18 జీడబ్ల్యూ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి.

    ఈ పవర్ స్టేషన్ల ద్వారా 65825 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఆలస్యం చేయకుండా మంచి ఐడియా చెప్పడం ద్వారా ఈ డబ్బును గెలుచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పోటీలో పాల్గొని సులభంగా డబ్బును గెలుచుకోవచ్చు. దాదాపు నెల రోజులు గడువు ఉండగా ఆసక్తి ఉన్నవాళ్లు ఐడియా చెప్పి డబ్బును గెలుచుకోవచ్చు. మరోవైపు ఎన్టీపీసీ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ఎన్టీపీసీ ఈ మధ్య కాలంలో వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తుండటం గమనార్హం.