Real Estate – NRI : ఇండియాలో ఎగబడి ఇళ్లు కొంటున్న ఎన్నారైలు.. ఎందుకంటే..!? 

స్వదేశంలో లేకపోయినా నిర్వాహకులే మెయింటనెన్స్‌ చేస్తుండడంతో పెట్టుబడికి నష్టం ఉండదని ఎన్నారైలు భావిస్తున్నారు. ఈ కారణంగా కూడా భారీగా ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. పదేళ్ల తర్వాత వచ్చినా తమ ఆస్తి తమకు ఉంటుందన్న నమ్మకంతోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఈమేరకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కూడా భరోసా ఇస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : June 8, 2023 1:39 pm
Follow us on

Real Estate – NRI : ఇండియాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుంది. కరోనా తర్వాత ఈ రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. భూమిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగింది. మధ్య తరగతి వాళ్లు కూడా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇండియాలో రియాల్టీ రంగంపై ఎన్నారైల దృష్టి పెట్టారు. అయితే వీళ్లు భూమిపై కాకుండా ఇళ్లపై పెట్టుబడి పెడుతున్నారు. కారోనాకు ముందు వరకు ఇండియాలో ఇళ్లు కొనే ఎన్నారైలు 10 శాతం ఉండగా కరోనా తర్వాత 20 శాతానికి పెరిగింది. దీనికి నిపుణులు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ఇండియాలో ఇళ్ల కొనుగోలు నిబంధనలు సరళీకృతం కావడం, రెండోది రూపాయి పతనం.
నిబంధనలు సరళీకృతం..
ఇండియాలో గతంలో విదేశీయులు ఇళ్లు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ కరోనా తర్వాత ఎన్నారైల పెట్టుబడులు పెరిగాయి ఏడాది రెండేళ్లలోనే రెంట్టింపు అయ్యాయి. ఇందుకు కారణం.. ఇండియాలో ఇళ్లు కొనడానికి గతంలో కఠిన నిబంధనలు ఉండేవి. కానీ పెట్టుబడులను ఆహ్వానించడం కోసం కేంద్రం నిబంధనలు సరళతరం చేసింది. దీంతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.
రూపాయి పతనం.. 
ఇక అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా ఎన్నారైలు ఇండియాలో పెట్టుబడులు అధికంగా పెట్టడానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం రూపాయి విలువ బాగా పడిపోయింది. ఎనిమిది వేల డాలర్లు పెడితే పది వేలు వస్తున్నాయి. ఎనిమిది లక్షలు పెడితే పది లక్షలు వస్తున్నాయి. ఈ కారణంగా కూడా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు.
పెరుగుతున్న విలువ.. 
ఎన్నారైల పెట్టుబడి పెరగడానికి ఆర్థిక నిపుణులు మరో కారణం కూడా చెబుతున్నారు. అమెరికాతో పోలిస్తే ఇండియాలో పెట్టుబడుల విలువ పెరుగుతుంది. ఉదాహరణకు డల్లాస్‌లో ఇల్లు కొంటే పదేళ్లు అయినా దాని విలువ ఏమీ పెరగదు. ఇండియాలో ఇల్లు కొంటే రెండు మూడేళ్లలోనే దాని విలువ 50 శాతం పెరుగుతుంది. ఈ కారణంగా కూడా ఎన్నారైలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఫుల్‌ సెక్యూరిటీ..
ఇక ఇండియాలో భూములకు బదులు ఇళ్లు కొనడానికి మరోకారణం కూడా ఉంది. ఎన్నారైలు కొనే ఇళ్లన్నీ ప్రీమియం రేజ్, ఖరీదైన ప్లాట్లు, విల్లాలు ఉంటున్నాయి. వీటిలో పెట్టుబడి పెడితే విలువ పెరగడంతోపాటు భద్రతకు కూడా ఢోకా ఉండదన్న భరోసా ఎన్నారైలో ఉంది. స్వదేశంలో లేకపోయినా నిర్వాహకులే మెయింటనెన్స్‌ చేస్తుండడంతో పెట్టుబడికి నష్టం ఉండదని ఎన్నారైలు భావిస్తున్నారు. ఈ కారణంగా కూడా భారీగా ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. పదేళ్ల తర్వాత వచ్చినా తమ ఆస్తి తమకు ఉంటుందన్న నమ్మకంతోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఈమేరకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కూడా భరోసా ఇస్తున్నాయి.