Homeబిజినెస్Nothing Phone 4b Design Features: వావ్..! ఇలాంటి డిజైన్ ఏ ఫోన్లలో చూసి ఉండరు.....

Nothing Phone 4b Design Features: వావ్..! ఇలాంటి డిజైన్ ఏ ఫోన్లలో చూసి ఉండరు.. ఇది ఎందుకంటే..

Nothing Phone 4b Design Features: లండన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ Nothing తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (4b) విడుదలకు ముందే డిజైన్ గురించి వెల్లడించింది. నేటి కాలంలో మొబైల్ కొనే సమయంలో చాలా మంది డిజైన్ విషయంలో కూడా ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కంపెనీ బ్లూ కలర్ లో ఉన్న మోడల్ ను లీక్ చేసింది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ఇందులో ఉండే మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి? వాటి వివరాల్లోకి వెళితె..

Nothing Phone (4b) ఫోన్‌ జూలై 7, 2026 న మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నథింగ్ కంపెనీ తన ఫోన్లలో ఎప్పుడూ వాడే సిగ్నేచర్ సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను ఈ ఫోన్ లోనూ కొనసాగించింది. అయితే, ఈసారి సరికొత్తగా ‘బ్లూ కలర్వే’ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో లోపల ఉండే మెకానికల్ విడిభాగాలు, స్క్రూలు మరియు ఇండస్ట్రియల్ టెక్స్చర్‌లు బ్లూ షేడ్‌లో స్పష్టంగా కనిపిస్తూ డిజైన్ పరంగా చాలా ప్రీమియంగా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఫోన్ పట్టుకోవడానికి వీలుగా ఉండేలా దీని బాడీకి సాఫ్ట్, స్కిన్-ఫ్రెండ్లీ టెక్స్చర్‌ను అందించారు.

గత మోడల్స్‌లో బ్యాక్ ప్యానెల్ మొత్తం విస్తరించి ఉండే గ్లిఫ్ లైటింగ్‌కు బదులుగా ఈ ఫోన్ (4b) లో సరికొత్త ‘గ్లిఫ్ బార్’ ను కంపెనీ ప్రవేశపెట్టింది. కెమెరా సెటప్‌కు కుడి వైపున నిలువుగా అమర్చిన 6 వైట్ LED లైట్లతో ఈ బ్లూ బ్లాక్ రూపొందింది. ఇందులో రికార్డింగ్ చేసేటప్పుడు బ్లింక్ అయ్యేలా ఒక రెడ్ ఇండికేటర్ కూడా ఉంది. ఈ గ్లిఫ్ బార్ ద్వారా యాప్ నోటిఫికేషన్‌లు, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్‌లు, ఛార్జింగ్ స్టేటస్ మరియు కెమెరా టైమర్ కౌంట్‌డౌన్ వంటి వాటిని యూజర్లు సులభంగా చూసుకోవచ్చు.

నథింగ్ ఫోన్ (4b) లో ఓవల్ (గుండ్రటి) ఆకారపు మాడ్యూల్‌లో అమర్చిన అప్‌గ్రేడెడ్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ 6.32 అంగుళాల AMOLED డిస్‌ప్లే ను అమర్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉండే ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ఉండనుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉండగా.. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేయనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular