NLM Scheme: ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలలో కొన్నిటిలో భారీగా నగదు ఇచ్చి ఆపై డిస్కౌంట్ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ పథకాల నుంచి ఖచ్చితమైన పూర్తి సమాచారం తెలియక చాలామంది నష్టపోతున్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే అలాంటి ఒక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం కింద అర్హులైన వారు కోటి రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం 50% రాయితీ కూడా ఇస్తుంది. అయితే చాలామందికి పథకం గురించి పూర్తి వివరాలు తెలియదు. కేంద్ర ప్రభుత్వం జీవాల పెంపకం వ్యాపారం కోసం భారీగా రుణాలను అందిస్తుంది. మనదేశంలో రోజురోజుకు మాంసం కొనుగోలు పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మార్కెట్లో మాత్రం డిమాండ్కు సరిపడిన మాంసం ఉత్పత్తి లేదు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో మాంసం ఉత్పత్తిని పెంచేందుకు జీవాల పెంపు కోసం ప్రత్యేకంగా రుణాలను మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద అర్హులైన వారికి సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తుంది. జీవాల పెంపకం కింద రుణం తీసుకున్న వాళ్ళు గొర్రెలు, మేకలు, నాటు కోళ్లు, పొట్టేళ్లు, పందులు మరియు పుంజుల పెంపకంతో పాటు పశుగ్రాసం, దాన పరిశ్రమలను కూడా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021-22లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ చాలామందికి పథకం గురించి పెద్దగా తెలియదు అని చెప్పొచ్చు. ఈ పథకం గురించి చాలామందికి సరైన అవగాహన మరియు పూర్తి వివరాలు తెలియకపోవడంతో జీవాల పెంపకంపై రుణం తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్న ఈ పథకం నిరుపయోగం అవుతుంది అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్ఎల్ఎం పథకం కింద యూనిట్కు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది.
అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం కింద 15 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం మంజూరు అవుతుంది. ఈ రుణం మొత్తంలో అధికారులు సెలెక్ట్ చేసిన యూనిట్ ఆధారంగా సుమారు కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ కల్పిస్తుంది. ఈ పథకం కింద రుణం పొందడానికి ఆసక్తి కలిగిన వారు www.nlm.udaymimtra.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవొచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ ఫోటో, అడ్రస్ తో పాటు ఆధార్ కార్డు మరియు బ్యాంకు స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అవసరం ఉండదు. చాలా ఏళ్ల నుంచి అమలులో ఉన్న ఈ పథకం నిరుపయోగంగా ఉండడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వాధికారులు ఎన్ఎల్ఎం స్కీం పై ప్రజలలో అవగాహన కలిగిస్తున్నారు.