Nissan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని వర్లీలోని రవాణా శాఖకు బెదిరింపు మెసేజ్ అందింది. ఈసారి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి కారును బాంబుతో పేల్చివేస్తామని బెదిరించారు. కొన్ని నెలల క్రితం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా అతన్ని చంపేస్తామని బెదిరించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ అప్రమత్తమై తన భద్రత కోసం తన కార్ కలెక్షన్‌లో కొత్త కారును చేర్చారు.
Also Read : నిస్సాన్ ఈ మోడల్ కారు కొంటే బంగారం ఫ్రీ
ఈ కారును దుబాయ్ నుంచి తెప్పించారు. విదేశాల నుంచి తెప్పించిన ఈ కారు ఏ కంపెనీది? ఈ కారు భారతదేశంలో అందుబాటులో లేదా? ఈ కారులో బుల్లెట్లను తట్టుకునేందుకు, బాంబుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక భద్రతా ఫీచర్లు ఉన్నాయా? ఈ కారు ధర ఎంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయ్ నుండి వచ్చిన ఈ కారు పేరు నిస్సాన్ పెట్రోల్. సల్మాన్ ఖాన్ తన భద్రత కోసం ఈ కారుపై ఎంత డబ్బు ఖర్చు చేశాడో చూద్దాం.
నిస్సాన్ పెట్రోల్ ఫీచర్లు
మీడియా కథనాల ప్రకారం, ఈ కారులో అనేక ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు బుల్లెట్ల వర్షాన్ని తట్టుకోగలదు. బాంబ్ అలర్ట్ ఇండికేటర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కారులో ప్రయాణించే వారి గోప్యత కోసం టింటెడ్ విండోస్ కూడా ఉన్నాయి.
నిస్సాన్ పెట్రోల్ ధర
మీడియా కథనాల ప్రకారం, ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం సల్మాన్ ఖాన్ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ కారు ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో అందుబాటులో లేదని గమనించాలి. అందుకే ఈ కారును దుబాయ్ నుంచి తెప్పించారు.
నిస్సాన్ పెట్రోల్ అనేది నిస్సాన్ మోటార్ కంపెనీ ఫుల్ సైజ్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్).నిస్సాన్ పెట్రోల్ ఏడు-సీట్ల SUV, ఇది పెద్ద ఫ్యామిలీకు అనుకూలంగా ఉంటుంది.దీనిలో ఏడుగురు ప్రయాణికులు హాపీగా ప్రయాణించవచ్చు. ఇది పవర్ ఫుల్ V8 ఇంజిన్‌తో వస్తుంది. ఇది అన్ని రకాల రోడ్ల మీద నడపడానికి అనుకూలంగా ఉంటుంది. కొండలు, గుట్టలను కూడా అవలీలగా ఎక్కేస్తుంది. నిస్సాన్ పెట్రోల్‌లో నాలుగు చక్రాల డ్రైవ్, లాక్ చేయగల డిఫరెన్షియల్, ఇతర ఆఫ్-రోడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి దానిని కచ్చా రోడ్లలో కూడా నడపడానికి వీలు కల్పిస్తాయి. ఇది లెదర్ సీట్లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్, అనేక సేఫ్టీ ఫీచర్లతో సహా అనేక లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
Also Read : గుడ్‌బై నిస్సాన్.. హలో రెనాల్ట్? భారత్‌లో ఆటోమొబైల్ రంగంలో బిగ్ ట్విస్ట్!