https://oktelugu.com/

Nissan : గుడ్‌బై నిస్సాన్.. హలో రెనాల్ట్? భారత్‌లో ఆటోమొబైల్ రంగంలో బిగ్ ట్విస్ట్!

Nissan : భారతదేశం ఒకవైపు టెస్లా, బీవైడీ, విన్‌ఫాస్ట్ వంటి విదేశీ కార్ల కంపెనీలకు తమ దేశంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు వెల్ కమ్ చెబుతోంది.

Written By: , Updated On : April 1, 2025 / 08:37 AM IST
Nissan

Nissan

Follow us on

Nissan : భారతదేశం ఒకవైపు టెస్లా, బీవైడీ, విన్‌ఫాస్ట్ వంటి విదేశీ కార్ల కంపెనీలకు తమ దేశంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు వెల్ కమ్ చెబుతోంది. మరోవైపు ఇక్కడ ఇప్పటికే ఉన్న జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటార్స్, ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ మధ్య ఒక పెద్ద డీల్ జరగబోతోంది. నిస్సాన్ కూడా భారత్‌కు టాటా చెప్పేస్తుందా?… రెనాల్ట్, నిస్సాన్ ఇండియాలో ఒక జాయింట్ వెంచర్‌లో కలిసి పనిచేస్తున్నాయి. దీని కోసం రెండు కంపెనీలు కలిసి రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RNAIPL) అనే కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు రెనాల్ట్ ఈ కంపెనీలో నిస్సాన్ 51 శాతం వాటాను కొనుగోలు చేసి కంపెనీకి పూర్తిగా 100 శాతం యజమాని కానుంది.

Also Read : ఎర్టిగాకు చెక్ పెట్టేందుకు నిస్సాన్ మాస్టర్ ప్లాన్

నిస్సాన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
రెనాల్ట్, నిస్సాన్ ఈ డీల్ గురించి ఎక్కువ వివరాలు వెల్లడించనప్పటికీ.. ఈ డీల్‌ను పూర్తి చేయడానికి రెండు కంపెనీల మధ్య ఒక షేర్ పర్చేజ్ డీల్ జరిగిందని మాత్రం స్పష్టం చేశాయి. రెనాల్ట్ గ్రూప్, నిస్సాన్ ఇండియాలో తమ ప్రాజెక్ట్‌లను కొనసాగిస్తాయి. రాబోయే రోజుల్లో రెండు కంపెనీల సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఒక ఆపరేటింగ్ డీల్‌పై కూడా సంతకం చేశారు.

పీటీఐ వార్తా కథనం ప్రకారం.. నిస్సాన్ రాబోయే సంవత్సరాల్లో ఇండియా నుంచి వాహనాలను ఎగుమతి చేయడానికి.. ఇక్కడి స్థానిక మార్కెట్‌లో తమ ఉత్పత్తులను అందించడానికి RNAIPL ఫ్యాక్టరీలను ఉపయోగించడం కొనసాగిస్తుంది. భారతదేశంలో నిస్సాన్ మాగ్నైట్ సహా ఇతర మోడళ్ల ఉత్పత్తిని కూడా కంపెనీ కొనసాగిస్తుంది. ఈ విధంగా రెండు కంపెనీలు భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాయి.

రెనాల్ట్ కోసం ఎలక్ట్రిక్ కారును తయారు చేయనున్న నిస్సాన్
ఈ షేర్ పర్చేజ్ డీల్‌లో రెండు కంపెనీల మధ్య మరొక విషయంపై కూడా ఒప్పందం కుదిరింది. రెనాల్ట్ గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ ‘ఆంపియర్’ కోసం నిస్సాన్ మోటార్ ఒక కారును డిజైన్ చేయడం నుంచి ఉత్పత్తి చేయడం వరకు అన్ని పనులు చేస్తుంది. ఈ కారు ఉత్పత్తి 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిస్సాన్ రాబోయే అధ్యక్షుడు, సీఈఓ ఇవాన్ ఎస్పినోసా మాట్లాడుతూ.. భారతదేశం కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజిటల్, ఇతర నాలెడ్జ్ బేస్డ్ సర్వీసెస్‌కు ఒక పెద్ద హబ్‌గా కొనసాగుతుందని అన్నారు. కంపెనీ ఇండియాలో తమ కొత్త SUV మోడళ్లను విడుదల చేస్తుంది. ఇక్కడ నుంచి ఎగుమతులు చేయడం కూడా కొనసాగిస్తుంది.

Also Read : స్విఫ్ట్, వెర్నా, ఎలివేట్లన్నీ వెనుకే.. ఎగుమతుల్లో నెంబర్ 1గా నిలిచిన నిస్సాన్ కారు