https://oktelugu.com/

కొత్త కారు కొనేవాళ్లకు శుభవార్త.. రూ.95 వేలు తగ్గింపు..?

దేశంలో గత కొన్ని నెలల నుంచి వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ప్రజల్లో చాలామంది కొత్త కారు, కొత్త బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన నిస్సాన్ కంపెనీ శుభవార్త చెప్పింది. జపాన్ కు చెందిన ఈ కంపెనీ తమ కంపెనీ మోడళ్ల కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తూ ఉండటం గమనార్హం. ఎస్‌యూవీ నిస్సాన్ కిక్స్ కారు కొనుగోలుపై భారీగా తగ్గింపును […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 27, 2021 / 05:53 PM IST
    Follow us on

    దేశంలో గత కొన్ని నెలల నుంచి వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ప్రజల్లో చాలామంది కొత్త కారు, కొత్త బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన నిస్సాన్ కంపెనీ శుభవార్త చెప్పింది. జపాన్ కు చెందిన ఈ కంపెనీ తమ కంపెనీ మోడళ్ల కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తూ ఉండటం గమనార్హం.

    ఎస్‌యూవీ నిస్సాన్ కిక్స్ కారు కొనుగోలుపై భారీగా తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. 95 వేల రూపాయల తగ్గింపును నగదు రూపంలో కాకుండా ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్, క్యాష్ డిస్కౌంట్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థలకు చెందిన లీవ్ ట్రావెల్ కన్సెషన్ వోచర్ల సహాయంతో నిస్సాన్ కంపెనీ కార్ల కొనుగోలుపై అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

    కంపెనీ వెబ్ సైట్ ద్వారా నిస్సాన్ కంపెనీ 95వేల రూపాయల తగ్గింపును అందిస్తుండటం గమనార్హం. ఎక్స్చేంజ్ బోనస్ కింద 50,000 రూపాయల తగ్గింపు పొందే అవకాశం ఉండగా క్యాష్ డిస్కౌంట్ రూపంలో 25,000 రూపాయలు, లాయల్టీ బోనస్ లో భాగంగా 20 వేల రూపాయలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే కంపెనీ ఈ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం.

    కొత్తగా కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లు సమీపంలోని ఆథరైజ్డ్ డీలర్‌షిప్స్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు తగ్గింపు ధరకే కారును పొందవచ్చు. 8 వేరియంట్ల రూపంలో నిస్సాన్ కిక్స్ కారు అందుబాటులో ఉండగా ఎంపిక చేసిన మోడల్ కార్లపై మాత్రమే డిస్కౌంట్ ఆఫర్లు వర్తిస్తాయి.