Nirma Company: ఆ కంపెనీ యాడ్ కనిపించగానే అందరూ ఆసక్తిగా చూసేవారు. అది కేవలం ప్రకటనే అయినప్పటికీ.. అందులో కనిపించే పాటను వల్లె వేసేవారు. అప్పటిదాకా సినిమాల్లోనే కనిపించిన హేమామాలిని.. ఆ ప్రకటన పుణ్యమా అని ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మరింత పాపులర్ అయిపోయారు. ప్రకటన మాత్రమే కాదు.. అందించే ఉత్పత్తిలోనూ క్వాలిటీ మైంటైన్ చేయడంతో ఆ కంపెనీ అంచనాల కందని లాభాలు అందుకుంది. ఏకంగా ఆ రోజుల్లోనే 17వేల కోట్ల ఆస్తులను సంపాదించుకుంది. రోజులన్నీ సజావుగా సాగుతున్న సమయంలో.. చేసిన ఒక తప్పు వల్ల కాలగర్భంలో కలిసిపోయింది.
Also Read: ‘రావు బహదూర్ ‘ సినిమా టీజర్ ఏంటి భయ్యా ఇలా ఉంది…రాజమౌళి ట్వీట్ సంగతేంటి..?
1990లో మన దేశాన్ని నిర్మా వాషింగ్ పౌడర్ దున్నేసింది.. అద్భుతమైన బ్రాండ్ గా అవతరించింది. పేద ఇంటి నుంచి మొదలు పెడితే ఆగర్భ శ్రీమంతుల వరకు నిర్మాణ పౌడర్ వాడేవారు. పాపులర్ బ్రాండ్లు కూడా నిర్మా దెబ్బకు అన్ని మూసుకున్నాయి. 1969 లో కర్సన్ బాయ్ పటేల్ నిర్మా కంపెనీకి అంకురార్పణ చేశారు. ఆయనకు నిరూపమ అనే పేరుతో ఓ కూతురు ఉండేది. ఆమె చనిపోవడంతో.. ఆమె పేరు మీద నిర్మా కంపెనీని స్థాపించారు. ఏకంగా 17 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.. కెమికల్ సైంటిస్ట్ అయిన కర్సన్ బాయ్.. అప్పట్లో హిందుస్థాన్ యూనిలీవర్ సర్ఫ్ 15 రూపాయలకు లభిస్తుంటే.. నిర్మా సర్ఫ్ ను కేవలం మూడు రూపాయలకు ఇచ్చేవారు. ఇది అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నది. అప్పట్లోనే మనదేశ డిటర్జెంట్ వ్యాపారంలో అరవ శాతం వాటాను సొంతం చేసుకుంది. నిర్మల్ సర్ఫ్ పెద్ద పెద్ద బ్రాండ్లను సైతం పడుకోబెట్టింది. బట్టలు శుభ్రంగా లేకపోతే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నిర్మా కంపెనీ ఆఫర్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇంతటితోనే నిర్మా కంపెనీ ఆగిపోలేదు.. శ్రీదేవి, హేమమాలిని, రీనా రాయ్, సోనాలి బింద్రే వంటి పాపులర్ బాలీవుడ్ నటీమణులతో ప్రకటనలు కూడా రూపొందించారు. 2000 సంవత్సరం నాటికి నిర్మా మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. మార్కెట్ మొత్తాన్ని శాసించిన ఆ ఉత్పత్తి వాటి ఆరు శాతానికి పడిపోయింది.
సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, టైడ్ వంటి బ్రాండ్స్ మనదేశంలోకి అడుగుపెట్టాయి. అవన్నీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలలో విపరీతంగా ఆకర్షించాయి. నిర్మా విలువ పడిపోయింది. అయితే అన్ని కంపెనీలు కొత్త కొత్త ఫార్ములాతో మార్కెట్లోకి వస్తే.. నిర్మా మాత్రం అక్కడే ఆగిపోయింది. చీప్ స్థాయిని దాటలేకపోయింది. దీంతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ కంపెనీ ఇప్పుడు డౌన్ ఫాల్ అయింది. దీనికి తోడు ఆ కంపెనీ తన సంబంధం సిమెంట్, రసాయనాలు, విద్యా వంటి వ్యాపారాలలోకి అడుగుపెట్టింది. అయితే మిగతా వ్యాపారాలను పర్వాలేదనే స్థాయిలో నిర్వహించినప్పటికీ.. సర్ఫ్ ల వ్యాపారాన్ని మాత్రం దూరం చేసుకుంది.