New Wage Code: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోందని సమాచారం. అక్టోబర్ నెల నుంచి కొత్త వేజ్ కోడ్ అమలులోకి రానుందని వెలువడుతున్న నివేదికలను బట్టి అర్థమవుతోంది.
కొత్త వేజ్ కోడ్ అమలులోకి వస్తే మాత్రం సెలవులు, వేతనం, పని వేళలు, పీఎఫ్, ఇతర అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్త వేజ్ కోడ్ వల్ల ఉద్యోగుల పని గంటలు 9 గంటల నుంచి 12 గంటలకు పెరిగే అవకాశం ఉంటుంది. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలనే నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
అయితే కొత్త వేజ్ కోడ్ వల్ల ఉద్యోగులకు ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గడంతో పాటు బేసిక్ వేతనం పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఆలవెన్స్ లు ఎక్కువగా ఇస్తూ బేసిక్ శాలరీ తక్కువగా ఇస్తున్నాయి. అయితే కొత్త రూల్స్ వల్ల కంపెనీ సీటీసీలో బేసిక్ శాలరీ 50 శాతం కంటే తక్కువగా ఉండకూడదు.
కొత్త నిబంధన అమలులోకి వస్తే ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కొత్త వేజ్ కోడ్ వల్ల ఉద్యోగులు ఉచిత మెడికల్ చెకప్ తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.