ఇలా ఆదాయం పొందాలని భావించే వాళ్లు ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఎంత మొత్తం టీడీఎస్ రూపేణా కట్ అయిందో ఆ మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లో చూపించి తిరిగి పొందగలిగే అవకాశం ఉంటుంది. www.incometax.gov.in వెబ్ సైట్ కు వెళ్లి పాన్ కార్డ్ ఆధారంగా వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత 26as పన్ను క్రెడిట్ తో ఉన్న ఫారమ్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత సంవత్సరంతో పాటు ఫైల్ రకాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎంత టీడీఎస్ తీసివేయబడిందనే వివరాలు తెలుస్తాయి. అందుకు సంబంధించిన పీడీఎఫ్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆదాయం పన్ను స్లాబ్‌లో పడని పక్షంలో దాని కోసం రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. మీ నుంచి కట్ అయిన డబ్బు మీ ఖాతాలోనే చేరుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే టీడీఎస్ రేటు ఎక్కువగా ఉంటుంది.
రెండు సంవత్సరాలు ఐటీఆర్ దాఖలు చేయకపొతే మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఐటీఆర్ ను దాఖలు చేయకపోతే మాత్రం ఈ సెక్షన్ వర్తించదని తెలుస్తోంది.