Registration Rules:  స్థిరాస్తి క్రయవిక్రయాలకు కొత్త నిబంధనలు.. భారీ మొత్తం చెల్లించాల్సిందే?

Registration Rules: దేశంలో రోజురోజుకు స్థిరాస్తి క్రయవిక్రయాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి న్యూ రూల్స్ ను అమలులోకి తీసుకొనిరావడానికి సిద్ధమైందని తెలుస్తోంది. వ్యవసాయ భూమి కాకుండా మరే స్థిరాస్థిని అయినా 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ విలువ లేదా అమ్మకం విలువలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తంలో ఒక శాతం టీడీఎస్ చెల్లించాలి. gisఆస్తులను కొనుగోలు చేసే […]

Written By: Navya, Updated On : February 15, 2022 10:54 am
Follow us on

Registration Rules: దేశంలో రోజురోజుకు స్థిరాస్తి క్రయవిక్రయాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి న్యూ రూల్స్ ను అమలులోకి తీసుకొనిరావడానికి సిద్ధమైందని తెలుస్తోంది. వ్యవసాయ భూమి కాకుండా మరే స్థిరాస్థిని అయినా 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ విలువ లేదా అమ్మకం విలువలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తంలో ఒక శాతం టీడీఎస్ చెల్లించాలి.

Registration Rules

gisఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాస్తవ విలువతో పోల్చి చూస్తే స్టాంప్ డ్యూటీ విలువ తక్కువగా ఉంటుంది. పన్ను ఎగవేతను అరికట్టాలనే ఉద్దేశంతో తాజా బడ్జెట్ లో ఈ నిబంధనలను పొందుపరిచారు. ఒక వ్యక్తి ఇంటిని కొనుగోలు చేస్తే ఇంటిని కొనుగోలు చేసిన మొత్తం లేదా స్టాంప్ డ్యూటీలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తానికి ఒక శాతం టీడీఎస్ రూపంలో చెల్లించాలి. స్టాంపు డ్యూటీ విలువ లేదా ఆస్తి అమ్మకం విలువ 50 లక్షల రూపాయలు దాటితే ఈ రూల్స్ వర్తిస్తాయి.

Also Read: ప్రత్యేక హోదా’ ఆ ఎన్నిక కోసమేనా?

కేంద్రం బడ్జెట్ లో రూపొందించిన ఈ నిబంధనల వల్ల పన్ను ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందేవాళ్లు రిఫండ్ రూపంలో ఈ మొత్తాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటయని చెప్పవచ్చు. ప్రభుత్వం టీడీఎస్ ను ఎక్కువ మొత్తం వసూలు చేసి అసెస్‌మెంట్‌ తర్వాత వెనక్కు ఇవ్వడం జరుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

అమ్మిన వ్యక్తికి సొంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుండగా కొనే వ్యక్తి టీడీఎస్ ఖాతాలోకి ఈ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది. టీడీఎస్ రిఫండ్ రూపంలో వచ్చేవరకు ఆ మొత్తం ప్రభుత్వం దగ్గరే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Also Read: తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మేనా?