Homeబిజినెస్New Laptops Buying Guide: కొత్తగా ల్యాప్టాప్ కొనేవారు వీటిని ముందే గమనించాలి..

New Laptops Buying Guide: కొత్తగా ల్యాప్టాప్ కొనేవారు వీటిని ముందే గమనించాలి..

New Laptops Buying Guide: ప్రస్తుతం చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ వైఫై అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం చదువుకునే సమయం నుంచే అన్ని రకాల శిక్షణ పొందుతున్నారు. అయితే భవిష్యత్తులో ఉద్యోగం పై పూర్తి అవగాహన రావడానికి కళాశాలలో ఉన్న సమయంలోనే అవసరమైన డెస్క్ టాప్ లేదా ల్యాప్టాప్ తో సంబంధాలు ఎక్కువగా ఏర్పరచుకుంటున్నారు. కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ల్యాప్టాప్ అవసరం చాలా పెరిగిపోయింది. దీంతో చాలామంది సొంతంగా ల్యాప్టాప్ కొనుగోలు చేస్తున్నారు. అటు విద్యార్థులు సైతం కళాశాలలో ఉన్న సమయంలోనే దీనిపై అవగాహన పెంచుకునేందుకు కొత్తగా ల్యాప్టాప్ కొంటున్నారు. అయితే కొత్తగా ల్యాప్టాప్ కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటుందో ముందే అవగాహన ఉండాలి. ఎవరికి ఎలాంటి ల్యాప్టాప్ ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం..

కొత్తగా ల్యాప్టాప్ కొనుగోలు చేసేవారు SSD క్ ఉన్నదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం పాత తరం HDD హార్డ్ డిస్క్ కంటే ఇవి చాలా ఉత్తమంగా పనిచేస్తాయి. ఇప్పుడున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కలిగిన ల్యాప్టాప్ చాలా అవసరం. అందువల్ల ఈ ఫీచర్లను సపోర్ట్ చేసే వాటిని కొనుగోలు చేయాలి. వీటి ధర ఎక్కువ అయినా కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే భవిష్యత్తుకు ఇవే ఎక్కువగా ఉపయోగపడతాయి.ల్యాప్టాప్ పనితీరులో ముఖ్యమైనది ర్యామ్. దీనికి కెపాసిటీ ఎక్కువగా ఉంటేనే పని వేగవంతంగా జరుగుతుంది. అందువల్ల 16 జిబి ఉన్న ల్యాప్టాప్ తీసుకోవడం మంచిది. అయితే చిన్నచిన్న అవసరాలకు 8 జిబి ఉన్నా సరిపోతుంది. కానీ దీనిని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కొన్ని డివైస్లలో అవకాశం ఉండదు.

ఇప్పుడు ఉన్న ల్యాప్టాప్ సైజు తో పాటు ఆపరేటింగ్ సిస్టం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ స్టోరేజ్ ఉండే వాటిని తీసుకోవడం అవసరం. ఇందులో భాగంగా 1 టీబీ స్టోరేజ్ ఉన్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం. కొన్ని పనుల కారణంగా ఎక్కువసేపు దీనిపైనే కూర్చోవాల్సి ఉంటుంది. అందువల్ల దీని డిస్ప్లే కన్వీనెంట్గా ఉంటేనే కళ్ళపై ఎలాంటి ప్రభావం పడదు. అందువల్ల OLED ఉన్న వాటిని ఎంచుకోవాలి. అయితే ఎక్కువ ధర అనిపిస్తే మినీ OLED డిస్ప్లే ని కూడా ఎంచుకోవచ్చు. కొంతమంది చేతులపైనే ఉంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివారు దీని బరువు విషయంలో కూడా ఆలోచించుకోవాలి. వర్క్ ఫ్రం ఓం చేసేవారు బరువు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు.. కానీ ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లేవారు దీని బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

విద్యార్థులకు, కోడింగ్ చేసేవాళ్లు పెద్ద స్క్రీన్ ఉన్న ల్యాప్టాప్ కొనుగోలు చేయాలి. కేవలం బ్రౌజింగ్ తో పాటు పరిమిత సాఫ్ట్వేర్ ఉపయోగించే వారు చిన్న స్క్రీన్ ఉన్న పర్వాలేదు. కొత్తగా కొన్ని వాటికి ఎక్కువగా యూఎస్బీ పోర్టులు ఉంటే మంచిది. వీటితోపాటు HDMI పోర్టు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే ల్యాప్టాప్ లన్ని వైఫై తోనే ఉంటున్నాయి. అందువల్ల ఆ రకమైనవే కొనుగోలు చేయడం అనుకూలంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version