Maruti New Cars 2023: దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ కంపెనీ ముందు వరుసలో ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు అనేక మోడళ్లు బయటకు వచ్చిరోడ్లపై తిరుగుతున్నాయి. కాలానుగుణంగా అప్డేట్ వెర్షన్లతో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు ధరను సైతం సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయిస్తున్నారు. మిడిల్ అండ్ అప్పర్ క్లాస్ వారికి నచ్చే విధంగా అన్ని రకాల వెహికిల్స్ మారుతి నుంచి రిలీజ్ అవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మారుతి వ్యాగన్ ఆర్,స్విప్ట్, తదితర మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా రిలీజ్ అయిన, మరికొద్దిరోజుల్లో మార్కెట్లోకి రాబోతున్న మరికొన్ని కార్ల గురించి తెలుసుకుందామా..
మారుతి ఇన్ విక్టో:
మారుతి నుంచి మల్టీ పర్పస్ వెహికిల్స్ ఎర్టిగా, ఎక్స్ ఎల్ 6 వినియోగదారులను ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ఇన్ విక్టో మార్కెట్లో సందడి చేస్తోంది. జూన్ 19న రిలీజ్ అయిన ఈ మోడల్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 174 పీఎస్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 186 ఎన్ ఎం ఇంజిన్ టార్చ్, 206 ఎన్ ఎం మోటార్ టార్చి ఉంది. ఈ మోడల్ ను రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
జిమ్మి:
మహీంద్రా థార్ ఏ లెవల్లో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అదే తరహాలో మారుతి కంపెనీ జిమ్మిని రోడ్లపై తిప్పుతోంది. ఈ ఏడాది జనవరిలో ఆటో ఎక్స్ ఫో లో పరిచయం చేసినప్పటి నుంచి జిమ్మిపై చాలా మంది మనసు పారేసుకున్నారు. ఈ మోడల్ లో చాలా వరకు వేరియంట్లు ఉన్నాయి. 101 బీహెచ్ పి శక్తితో పాటు 130 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అందుబాటులో ఉండనుంది. 15 అంగుళాల స్టీల్ వీల్స్, 7 అంగుళాల స్మార్ట్ పప్లే ప్రో టచ్ స్క్రీన్ సిస్టమ్ అందుబాటులో ఉంది. దీనిని రూ.12 నుంచి 15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మారుతి ఈవీఎక్స్:
మారుతి నుంచి మరో లేటేస్టు మోడల్ రోడ్లపైకి రానుంది. అదే ఈవీ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ . ఈ కారు పొలండ్ వీధుల్లో దూసుకుపోయింది. జూన్ ఎండింగ్ లేదా జూలై నెలలో దీనిని మార్కెట్లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. క్లోజ్ డ్ ఆఫ్ గ్రిల్, వీ షేప్ డీఆర్ ఎల్స్, మౌంటెడ్ ఆర్ వీఎంలు, అలాయ్ వీల్స్ ఈ మోడల్ సొంతం. లేటేస్టుగా కావాల్సిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా.
మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్ష్ ఫ్యూయెల్:
మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి అదనంగా ఫీచర్స్ ను జోడించి అప్డేట్ వెర్షన్ తో మార్కెట్లోకి రాబోతుంది. వ్యాగన్ ఆర్ కు ఉండే ఫీచర్లతో పాటు మరిన్ని అదనంగా ఉండే ఈ వెహికిల్ ను రూ.8.50 లక్షలకు విక్రయించే అవకాశం ఉంది.