Nepal Raj: కష్టే ఫలి అనేది వందకు రెండు వందల శాతం నిజం. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనేందుకు తమిళనాడులోని కరవు జిల్లా రామనాథపురం జిల్లాకు చెందిన నేపాల్‌రాజ్ కుటుంటుంబం చక్కటి ఉదాహరణ. 1960లో ఆ కుటుంబం పరిస్థితి ఘోరంగా ఉండేది. చుట్టపక్కల పెరిగే తుంగ గడ్డిని తెచ్చి చాపలు(Mats) అల్లుతుండేవారు అక్కడి మహిళలు. వారు అల్లిన చాపలను పెద్ద వ్యాపారికి అమ్మేవారు. చిరు వ్యాపారమే అయినా ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడేందుకు సాయపడింది. అయితే అట్టపెట్టెల(cotan box) రాకతో చేపల వ్యాపారం క్షనీణించింది. నేపాల్‌రాజ్(Nepalraj) కుటుంబం వీధిన పడింది. ఆ ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉండగా నేపాల్‌రాజ్ జెద్దవాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు పదో రతగతిలో మానేసి తుత్తుకుడి పట్టణానికి వెళ్లాడు. భవన నిర్మాణ కార్మికుడిగా మ ఆరాడు. నెలకు రూ.50 జీతంతో పనిచేశాడు. రాళ్లు ఎత్తాడు. సిమెంటు బస్తాలు మోశాడు. శారీక శ్రమకన్నా.. నేపాల్‌రాజ్ మెదడు చురుకుదనం అక్కడున్నవాళ్లందరికీ నచ్చింది. నిర్మాణం చేపడుతున్న యజమాని.. అతడిని ఆఫీస్‌బాయ్‌గా రమ్మన్నాడు. కొన్నాళ్లకే సేల్స్‌మెన్‌గా, తర్వాత క్యాషియర్‌గా మారాడు. నాలుగేళ్లలోనే భవన నిర్మాణ బిజినెస్(Bussiness)ను అవపోసన పట్టాడు. నిర్మాణ పనులకన్నా వాటికి అవసరమైన ఇసుక, సిమెంటు, బాండీలు, బ్రష్‌లు తదితర వస్తువులను విక్రయించే వ్యాపారం లాభదాయకమని గుర్తించాడు. నాలుగేళ్ల తన జీతం నుంచి దాచిన డబ్బుతో బిజినెస్ ప్రారంభించాడు. కన్యాకుమారి దగ్గర నాగరాకాయిల్ పట్టణంలో తన మామయ్యతో కలిసి ఓ షాపు పెట్టాడు. రూ.15 వేల పెట్టుబడి ఐదేళ్లలో రెట్టింపు లాభాలను తెచ్చిపెటింది. మామయ్యకు వయసు పైబడడంతో 1977లో తానే సొంతంగా బిజినెస్ ప్రారంభించాడు.
ప్రతి అడుగూ సవాలే…
నేపాల్‌రాజ్ అడుగు పెట్టిన నాగర్ కోయిల్ పట్టణ అప్పుడప్పుడే ప్రగతిబాట పడుతోంది. స్థిరాస్తి(Real estate) వ్యాపారం పుంజుకుంటోంది. భవన నిర్మాణ పనులు ఉదయం 8 గవంటలకే మొదలవుతాయనుకుంటే ఆరు గవంటలకే ఆ ప్రదేశానికి వెళ్లి నిర్మాణ వస్తువులు కావాల్సిన విక్రయాలు పెంచడం మొదలు పెట్టాడు నేపాల్‌రాజ్. షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సైట్ వద్దకే కావాల్సిన మెటీరియల్ దొరకడంతో వ్యాపారం విస్తరించింది. తొలి ఏడాదే రూ.10 లక్షల టర్నోవర్ అందుకుంది. సహజంగానే వాపారులు అసూయకు కారణమైంది. బయటి ప్రాంతం నుంచి వచ్చి తమను మించి పోయాడన్న కోపంతో డీలర్స్ ఎవరూ అతని వస్తువులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో వ్యాపారం పడిపోయింది. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లు నేపాల్‌రాజ్ అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని మధురై నుంచే వస్తువులు తీసుకురాసాగాడు. స్థానికంగా దొరికేవాటి నాణ్యతకన్నా ఇవి బాగుండడంతో వ్యాపారం జోరందుకుంది. దీంతో తన కూతురు పేరుతో లావణ్య శానిటరీ సెంటర్(Lavanya sanitary) ప్రారంభించాడు. వచ్చే ప్రతీ కస్టమర్‌పైనా శ్రద్ధ పట్టడంతో దానికీ బాగా పేరొచ్చింది. నాగర్‌కోయిల్‌లో అతిపెద్ద సాపుఆ మారింది. 2000లో కిచెన్ సింక్‌ల తయారీ కోసం ప్రారంభించిన వల్లి స్టీల్ ఇండస్ట్రీస్ నేపాల్ రాజ్‌ను పారిశ్రామికవేత్తను చేసింది. ఆ సంస్థ తయారు చేసిన ప్రిన్స్ కిచెక్ సింక్ అగ్రశ్రేణి బ్రాండ్లలో ఒకటిగా మారింది. నేపాల్‌రాజ్ ఈ పరిశ్రమ టర్నోవర్ రూ.120 కోట్లకు చేరింది.