
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి కాగా ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వారు ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ప్రతి నెలా పెన్షన్ ను పొందే అవకాశంతో పాటు ఒకేసారి భారీ మొత్తం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. 30 సంవత్సరాల వ్యక్తి రోజుకు రూ.200 ఆదా చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.80 లక్షలకు పైగా పొందే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా చేయడం ద్వారా ప్రతి నెలా 27,000 రూపాయలు పెన్షన్ ను పొందవచ్చు. నెలకు 6,000 రూపాయల చొప్పున చెల్లిస్తే 30 ఏళ్లలో ఏకంగా రూ.21.6 లక్షలు ఇన్వెస్ట్ చేసిన మొత్తం కాగా చేతికి వచ్చే మెచ్యూరిటీ డబ్బులు కోటీ 30 లక్షల రూపాయలు అవుతాయి. ఇందులో రూ.54 లక్షలను యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా ఆ మొత్తం 40 శాతం మొత్తం కావడం గమనార్హం. మిగిలిన రూ.82 లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ మార్కెట్ లింక్డ్. స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ స్కీమ్ లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్ కూడా పొందే ఛాన్స్ కూడా ఉండటంతో ఈ స్కీమ్ చాలా మందికి అనువుగా ఉంటుందని చెప్పవచ్చు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు బ్యాంకుల ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.