Adhar Card: మనలో చాలామంది ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగిస్తూ ఉంటారు. ఆధార్ కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదై ఉన్నా నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ లో పేరు తప్పుగా నమోదై ఉండటం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది తప్పుగా నమోదైన వివరాలను సరి చేసుకోవడానికి ఆసక్తి చూపితే మరి కొందరు మాత్రం ఆ వివరాలను సరి చేసుకోవడానికి ఇష్టపడరు.
రెండుసార్లు ఇప్పటికే మీరు ఆధార్ కార్డులో పేరును మార్చుకుని ఉంటే మాత్రం భవిష్యత్తులో ఆధార్ కార్డులో పేరును మార్చుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. ఆధార్ కార్డులో జెండర్ ను మార్చుకోవాలని భావించే వాళ్లు కేవలం ఒకసారి మాత్రమే ఆ వివరాలను మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ వివరాలను కూడా ఒక్కసారి మాత్రమే మార్చుకునే ఛాన్స్ ఉంటుంది.
అయితే ఈ వివరాలు కాకుండా ఇతర వివరాలను మాత్రం ఎన్నిసార్లు అయినా సులభంగా మార్చుకోవచ్చు. చిరునామా, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఫోటోను ఎన్నిసార్లు అయినా మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తుండటం గమనార్హం.