Nabard Scheme: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా ఈ సంస్థ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుండటం గమనార్హం. మొత్తం 40 సీట్లు ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీ స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
టాలెంట్ ఉన్న విద్యార్థులను ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేయడం జరుగుతుందని తెలుస్తోంది. ఇందుకోసం ఎంపికైన విద్యార్థులు వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామీణ సంఘం సంస్థల అభివృద్ధి కొరకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధి కొరకు పని చేయల్సి ఉంటుంది. మొత్తం 40 ఖాళీలలో ప్రధాన కార్యాలయం పరిధిలో 5 సీట్లు ఉండగా ప్రాంతీయ కార్యాలయాలు/టీఈ పరిధిలో 35 సీట్లు ఉన్నాయని సమాచారం.
Also Read: AP Cabinet Expansion Date Fixed: కేబినెట్ విస్తరణ ముహూర్తం ఈనెల 11కు జగన్ ఫిక్స్ అయ్యారా?
దరఖాస్తు చేసుకోవడానికి సోషల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ పూర్తి చేసిన లేదా చదువుతున్న వాళ్లు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న వాళ్లు కూడా ఈ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్న వాళ్లు కూడా ఈ స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్ వ్యవధి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది. ఎవరైతే ఇంటర్న్‌షిప్‌కు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 18,000 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. ఫీల్డ్ విజిట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇతర ఖర్చులకు కూడా డబ్బులను చెల్లించడం జరుగుతుంది. https://www.nabard.org/whats-new.aspx వెబ్ సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: RRR Movie Child Artist Malli: ఆర్ఆర్ఆర్ చిత్రంలో చిన్నారి మల్లి పాత్ర చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?