Mukesh Ambani Private Jet: కొత్త విమానం కొన్న భారత కుబేరుడు.. ఎగిరే ఇంద్రధనస్సు అది.. అదిరిపోయేలా ఉన్న దీని ధర ఎంతో తెలుసా?

భారతీయ కుబేరుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. ఇటీవలే సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసి తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం చేశారు. తాజాగా విమానం కొనుగోలు చేశారు.

Written By: Raj Shekar, Updated On : September 24, 2024 3:44 pm

Mukesh Ambani Private Jet

Follow us on

Mukesh Ambani Private Jet: భారత్‌లోనే కాదు ఆసియాలోనే అపర కుబేరుడిగా గుర్తింపు పొందారు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ దేశంలో పదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతన్నారు. ఇటీవలే ఆయన తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆరు నెలలుగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. ఈ పెళ్లికి సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. పెళ్లి కోసమే భారీగా కర్చు చేసిన ఆయన తాజాగా మరో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ చేశారు. బోయింగ్‌ 7373 మ్యాక్స్‌ 9 విమానం కొనుగోలు చేశారు. దీని విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విమానం గంటకు 838 కి.మీ వేగంతో నాన్‌ స్టాప్ గా 121,770 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. ఇందులో ముకేశ్‌ అంబానీ అభిరుచులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించారు. స్విట్జర్లాండ్‌లో రీమోడల్‌ చేయించారు. త్వరలోనే ఈ విమానాన్ని ముంబైకి తీసుకువస్తారని తెలిసింది.

ఇప్పటికే 9 ప్రైవేటు జెట్లు..
ముకేశ్‌ అంబానీకి ఇప్పటికే 9 ప్రైవేటు జెట్లు ఉన్నాయి. తాజాగా కొనుగోలు చేసిన విమానంతో జెట్‌ల సంఖ్య 10కి చేరింది. తాజాగా కొనుగోలు చేసిన విమానం స్విట్జర్‌లాండ్‌కు చెందినది. ఈ జెట్‌కు బేసెల్, జనీవా, లండన్, లుటన్‌ విమానాశ్రయాల్లో టెస్టింగ్‌ చేశారు. అన్ని అప్‌గ్రేడ్‌లు పూర్తయిన తర్వాత మరిన్ని టెస్టులు పూర్తిచేసి ఇండియాకు తీసుకు వచ్చారు. ఆగస్టు 27న బేసెల్‌ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. ఇది 9 గంటల్లో 6,234 కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రస్తుతం దీనిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని కార్గొ టెర్మినల్‌ సమీపంలో పార్క్‌ చేశారు. రిలయన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్న ముంబైకి త్వరలోనే దీనిని తీసుకు వస్తారని సమాచారం.

విమానం ప్రత్యేకతలు మరికొన్ని
ఈ బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్‌లలో ఒకటి. ఇది రెండు సీఎఫ్‌ఎంఐ ఎల్‌ఈఏపీ – 18 ఇంజిన్లతో పనిచేస్తుంది. ఈ విమానం 8401 ఎంఎస్‌ఎన్‌ నంబర్‌ కలిగి ఉంది. నిరంతరాయంగా 11,770 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. ఇక దీని ధర రూ.118.5 మిలియన్లు. ఈ విమానంలో క్యాబిన్‌ రెట్రోఫిట్టింగ్, ఇంటీరియర్‌ మాడిఫికేసన్‌ ఖర్చులు ఉండవు. ఈ కొత్త జెట్‌ బోయింగ్‌ మ్యాక్స్‌ 8 కన్నా పెద్ద క్యాబిన్, కార్గొ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ అల్ట్రా–లాంగ్‌ రేంజ్‌ బిజినెస్‌ జెట్‌ కోసం అదాని ఫ్యామిలీ రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేసిందని సమాచారం.

ప్రపంచంలోనే ఖరీదైన ఇల్లు..
ఇదిలా ఉంటే.. ముకేశ్‌ అంబానీ అత్యంత ఖరీదైన ప్రదేశంలో నిర్మించిన ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ముకేశ్‌ అంబానీతోపాటు ఆయన కుమారులు కూడా తండ్రిని పాలో అవుతుఆన్నరు. అనంత్‌ అంబానీ ఖరీదైన వస్తువుల సేకరణలో ముందు ఉంటారు. వివాహం సందర్భంగా ఆయన ధరించిన పటేక్‌ ఫిలిప్‌ వాచ్‌ అందరినీ ఆకట్టుకుంది.