Mukesh Ambani: చాట్ జీపీటీ లోకి ముకేశ్ అంబానీ.. సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమంటే?

రిలయన్స్ రూపొందించే చాట్ జిపిటికీ "భారత్ జిపిటి" అనే పేరు పెట్టింది. దీని పనితీరుకు సంబంధించి ముంబైలో ఓ సాంకేతిక సదస్సు నిర్వహించింది.

Written By: Suresh, Updated On : February 21, 2024 1:31 pm

Mukesh Ambani

Follow us on

Mukesh Ambani: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం సాంకేతిక ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతోంది. ఓపెన్ ఏఐ “చాట్ జీపీటీ” ప్రవేశపెట్టింది.. ఇటీవల “సోరా” ను కూడా తీసుకొచ్చింది. టెక్స్ట్ ఇస్తే వీడియో రూపొందించేలాగా తయారుచేసింది. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ని తీసుకొచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ కాపీ లాట్, గూగుల్ జెమినీ ని రూపొందించాయి. అయితే ఇప్పటివరకు అమెరికా వెలుపల ఉన్న మూడు పెద్ద కార్పొరేట్ సంస్థలే ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఈ విభాగంలో వేలకోట్లను పెట్టుబడులుగా పెట్టాయి. భవిష్యత్తు లో సాంకేతిక రంగం మొత్తం ఈ విభాగం మీదే ఆధారపడి పనిచేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ఐఐటి బాంబే సాంకేతిక విద్యార్థులు, ఇతర 8 అనుబంధ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో చాట్ జిపిటి సేవలు ప్రారంభించనున్నారు.

రిలయన్స్ రూపొందించే చాట్ జిపిటికీ “భారత్ జిపిటి” అనే పేరు పెట్టింది. దీని పనితీరుకు సంబంధించి ముంబైలో ఓ సాంకేతిక సదస్సు నిర్వహించింది. వివిధ సాంకేతిక నిపుణుల ముందు దీని పనితీరుకు సంబంధించి ఓ వీడియో ప్లే చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తమిళ బైక్ మెకానిక్ తన మాతృభాషలో AI బాట్ ను అడిగాడు. ఓ బ్యాంకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హిందీలో సంభాషించాడు. హైదరాబాదులోని ఓ వెబ్ డెవలపర్ భారత్ జిపిటి సాయంతో కంప్యూటర్ కోడ్ రాశాడు. రిలయన్స్, ఐఐటి బాంబే, ఇతర విద్యాసంస్థల రూపొందించిన ఈ భారత్ జిపిటి కనుక విజయవంతం అయితే దానిని “మోడల్ హనుమాన్” గా పిలుస్తామని చెబుతున్నారు. భారత్ జిపిటి నాలుగు ప్రధాన రంగాలలో సేవలు అందించేలా రూపొందించారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పాలన, ఆర్థికం వంటి విభాగాలలో సేవలందించేందుకు దీన్నీ రూపొందించామని రిలయన్స్, ఐఐటీ బాంబే ప్రతినిధులు చెబుతున్నారు. 11 భాషల్లో ఇది పని చేసే లాగా అభివృద్ధి చేశారు. లైట్ స్పీడ్ వెంచర్స్ అధిపతి వినోద్ ఖోస్లా ఆధ్వర్యంలోని కృత్రిమ్, సర్వం వంటి స్టార్టప్ లు కూడా ఓపెన్ స్టోర్డ్ ఏఐ మోడల్స్ రూపొందిస్తున్నాయి. ఓపెన్ ఏఐ వంటి సంస్థలు పెద్ద ఎల్ఎల్ఎం లను రూపొందిస్తున్నాయి. ” భారతదేశంలో 1.4 బిలియన్ల ప్రజలు చదవలేరు లేదా రాయలేరు. అందువల్లే రిలయన్స్ జియో నిర్దిష్టమైన ఉపయోగాల కోసం అనుకూలించిన మోడళ్ళు నిర్మిస్తోంది. టెలికాం టు రిటైల్ వరకు రిలయన్స్ 450 మిలియన్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది.. వారందరినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్ళించేందుకు జియో బ్రెయిన్ పనిచేస్తోంది. ఎల్ ఎల్ ఎం లు విస్తారమైన డాటా నుంచి సహజంగా ప్రతిధ్వనించే వ్యవస్థలను రూపొందిస్తాయి. ఇటువంటి నమూనాలు ఉత్పాదక ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకుంటాయి. కూడా ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జిపిటి వల్ల ప్రాచుర్యం పొందిన కృత్రిమ మేధస్సు కొత్త రూపమని” ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ హెడ్ గణేష్ రామకృష్ణన్ వ్యాఖ్యానించారు..

ఇక రిలయన్స్ రూపొందిస్తున్న భారత జిపిటి వెనుక ఐఐటి బాంబే, ఇతర ప్రఖ్యాత విద్యాసంస్థల కృషి ఉన్న నేపథ్యంలో దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించిన ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇది మొట్టమొదటి పీపీపీ ప్రాజెక్టు. పైగా ఇందులో విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. దీనిని మార్చి నెలలో ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు మొత్తం పూర్తయ్యాయి. సాంకేతికంగా చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలిపోయాయని భారత జిపిటి వర్గాలు అంటున్నాయి..” ఇది భారతీయ ఉమ్మడి కుటుంబం లాంటిది. భారత్ జిపిటి అని పేరు పెట్టడానికి కారణం కూడా అదే. ఇది అనేక విషయాలలో సమగ్ర సమాచారం అందిస్తుంది.. దేశాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని” భారత్ జిపిటి వర్గాలు అంటున్నాయి.. మార్చిలో ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడులు పెట్టి.. అధునాతన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ ఏఐ చాట్ జిపిటిని ప్రవేశపెట్టిన తర్వాత సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. కానీ అతి త్వరలోనే భారత్ లాంటి అతిపెద్ద దేశంలో రిలయన్స్ లాంటి బడా సంస్థ, ఐఐటి బాంబే, ఇతర విద్యా సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టు రూపొందించడం గొప్ప విషయం అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.