Homeబిజినెస్Motorola Razr Fold new smartphone: మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి.. ఇది ఎవరికీ...

Motorola Razr Fold new smartphone: మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి.. ఇది ఎవరికీ ఉపయోగమంటే..

Motorola Razr Fold new smartphone: Motorola తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Razr Foldను మే 20, 2026 భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Gen 5ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్, ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 3nm ఆర్కిటెక్చర్‌తో రూపొందిన ఈ చిప్‌సెట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా వేగవంతమైన, స్మార్ట్ AI అనుభూతిని అందిస్తోంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Motorola Razr Fold ఫోన్ రెండు అద్భుతమైన డిస్‌ప్లేలతో వస్తోంది. బయట వైపు 6.6 అంగుళాల ఎక్స్‌ట్రీమ్ AMOLED స్క్రీన్ ఉండగా.., లోపల 8.1అంగుళాల 2K భారీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండి, ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విమాన తయారీలో వాడే గ్రేడ్ స్టీల్ హింజ్ మరియు టైటానియం రీఇన్‌ఫోర్స్‌మెంట్ వల్ల ఈ ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది.

ఈ మొబైల్ లో అత్యుత్తమ ఫోల్డబుల్ కెమెరా సిస్టమ్ ను చూడొచ్చు.50MP సోనీ LYTIA 828 సెన్సార్ కలిగిన ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ తో పనిచేస్తుంది. 8K వీడియో రికార్డింగ్‌ సపోర్ట్ కూడా ఉండడంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో బలమైన బ్యాటరీ వ్యవస్థను కూడా చూడొచ్చు. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన ఫోల్డబుల్ ఫోన్లలో లేని అతిపెద్దదైన 6000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి 80W టర్బో ఛార్జింగ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

భారత్‌లో ఈ ఫోన్ ధరలు కింది విధంగా ఉన్నాయి: 12GB + 256GB వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ. 1,49,999 గా ఉంది.16GB + 512GB మోడల్ ను రూ.1,59,999 తో విక్రయిస్తున్నారు.ఈ మొబైల్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు. బ్యాంక్ డిస్కౌంట్లతో ప్రారంభ ధర రూ.1,39,999 కే లభిస్తుంది. అంతేకాకుండా, జూన్ 20 లోపు కొనుగోలు చేసే వారికి ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్(విలువ ₹57,000) చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. గేమింగ్ కోసం లేదా మంచి కెమెరా కోసం ఫోన్ కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular