Homeబిజినెస్Motorola Edge 70 Pro: మార్కెట్లోకి రాకముందే ఈ ఫోన్ గురించి లీకులు.. ధర ఎంతంటే..

Motorola Edge 70 Pro: మార్కెట్లోకి రాకముందే ఈ ఫోన్ గురించి లీకులు.. ధర ఎంతంటే..

Motorola Edge 70 Pro: భారత మార్కెట్లో Motorola మొబైల్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలా మంది కొనుగోలు చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇందులో ఉండే ఫీచర్లు చాలా మంది లైక్ చేస్తారు. ఇందులో భాగంగా మోటరోలా కంపెనీకి చెందిన Edge 70 Pro త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇది ఏప్రిల్ చివరి వారంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతలో ఈ ఫోన్ గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది. దీని ఫీచర్లు, కెమెరా పనితీరు చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Motorola Edge 70 Pro ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ P-OLED లేదా OLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1.5K క్లాస్ రిజల్యూషన్ ద్వారా పనిచేసే ఈ మొబైల్ డిజైన్ పరంగానూ ఆకట్టుకోనుంది. ఇది డీప్ బ్లూ, మ్యూటెడ్ ఓలివ్ గ్రీన్, వైట్ కలర్లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. కొన్ని వేరియంట్లలో tailored-fabric, satin-luxe, marble finish‌లలో కూడా ఉండొచన్ని తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన చిప్‌సెట్‌తో పాటు 12GB RAM ఉండనుంది. అలాగే MediaTek Dimensity లేదా Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ విషయంలో Edge 70 Pro బలమైన అప్‌గ్రేడ్‌గా నిలిచే అవకాశం ఉంది. పలు లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో 6,500mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉండొచ్చని.. ఇది 90W నుంచి 100W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించే అవకాశముందని సమాచారం.
కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలవొచ్చు. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉండొచ్చని, సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.

ధర విషయానికి వస్తే.. Motorola Edge 70 Pro భారత మార్కెట్లో రూ.31,999 నుంచి రూ.35,000 మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. మరోవైపు కొన్ని అంచనాలు దీని ధరను రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉంచుతున్నాయి. అయితే తుది ధర స్టోరేజ్ వేరియంట్ మరియు మార్కెట్ పొజిషనింగ్‌పై ఆధారపడే అవకాశం ఉంది.

పెద్ద బ్యాటరీ, హై-రిఫ్రెష్ కర్వ్డ్ డిస్‌ప్లే, టెలిఫోటో కెమెరా, ప్రీమియం డిజైన్‌తో Motorola Edge 70 Pro మార్కెట్లో మంచి పోటీ ఇవ్వగల ఫోన్‌గా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం బయటికి వచ్చిన సమాచారం ఎక్కువ భాగం లీకులు, అంచనాలపై ఆధారపడినదే కావడంతో పూర్తి స్పెసిఫికేషన్లు, అధికారిక ధర కోసం లాంచ్ ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version