Moto G 85: 2026 సంవత్సరంలో కొత్తగా మొబైల్ కొనాలని అనుకునే వారికి కొన్ని కంపెనీలు ఇప్పటికే అనుకూలమైన డివైస్ లను ప్రవేశపెట్టాయి. అయితే లేటెస్ట్ గా Motorola కంపెనీ యూత్ తో పాటు రోజువారి అవసరాలకు ఉపయోగపడే విధంగా కొత్త మొబైల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ఉండే కెమెరా, బ్యాటరీ తో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన ఫీచర్లు ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా 5G నెట్వర్క్ కనెక్టివిటీ లో మిగతా ఫోన్ల కంటే భిన్నంగా ఉండడంతో దీనిపై ప్రత్యేకంగా చర్చ సాగుతుంది. అయితే ఎన్ని ఫీచర్లు ఉన్నా ఈ ఫోన్ ధర ఎంతో అని అనుకుంటున్నారు. కానీ బడ్జెట్ లోనే వచ్చే విధంగా ధర ఏర్పాటు చేశారు. మరి ఆ వివరాల్లోకి వెళితే..
Motorola కంపెనీకి చెందిన Moto G 85 అనే మొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందేందుకు సిద్ధమవుతోంది. మిగతా ఫోన్ల కంటే ఇందులో బ్యాటరీ వ్యవస్థ ప్రత్యేకంగా చేర్చారు. ఈ మొబైల్లో 7300 mAh బ్యాటరీ ఉండరు ఉంది. ఇది 150 W ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజులపాటు వినియోగించుకునేలా డౌన్ టైం తక్కువగా ఉంటుంది. అలాగే రోజువారి వినియోగం చేసిన చార్జింగ్ తక్కువగా అయిపోతుంది. గేమింగ్ కోరుకునేవారు సైతం ఈ మొబైల్ ను కొనుగోలు చేసే విధంగా అనుకూలంగా ఉంది.
ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇందులో 6.7 అంగుళాల HD+ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రిష్ రేట్ తో పని చేస్తుంది. మొబైల్ పై ఉండే గ్లాస్ స్మూత్ స్క్రోలింగ్ కు.. నాణ్యమైన వీడియోలు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బ్రైట్నెస్అం దిస్తుంది. మూవీస్ చూసేవారికి అనుకూలమైన మొబైల్ అని అనుకోవచ్చు. అలాగే ఇందులో క్లీన్, ప్రాక్టికల్ డిజైన్ ఉండడంతో చూడడానికి లూకింగ్ బాగుంటుంది. మృదువైన వేలిముద్రలు తొలగించేందుకు వీలుగా గ్లాస్ ను తయారు చేశారు. బ్యాటరీ పెద్దది అయినప్పటికీ ఫోన్ బరువు తక్కువగా ఉంటుంది.
ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ కంటే ఇందులో అప్డేట్ అయినా కెమెరాను అమర్చారు. 64 MP మెయిన్ కెమెరాతో పనిచేసే ఇందులో పగలు, సాయంత్రం అని తేడా లేకుండా అనుకూలమైన ఫోటోలు వస్తాయి. అలాగే 4k వంటి వీడియోలు కూడా రికార్డు చేసుకోవచ్చు సోషల్ మీడియా కంటెంట్ ఉపయోగించే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 6s gen3 ప్రాసెసర్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం దీనిని మార్కెట్లో రూ.12,449 ధరతో విక్రయిస్తున్నారు. అత్యధిక లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ కలిగి ఉండి ధర తక్కువగా అందించే మొబైల్ ఇదేనని చాలామంది చెబుతున్నారు.