Diamond Import Duty India: బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంటుంది. బంగారం మన దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి కాదు. అందువల్లే విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కోసం ఆ స్థాయిలో మన దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చుపెట్టే స్థాయి లేకపోవడంతో.. పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. బంగారం మీద సుంకాన్ని పెంచేసింది. దీంతో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.
బంగారం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు డైమండ్స్ మీద తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.. ఎందుకంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ డైమండ్ కన్జ్యూమర్ కంట్రీగా ఇండియా నిలిచింది. ఇప్పటివరకు చైనా, జపాన్ దేశాల తర్వాత భారత్ ఉండేది. వజ్రాల వినియోగంలో అమెరికా మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇటీవల డి బీర్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం భారత దేశంలో న్యాచురల్ డైమండ్ మార్కెట్ ఏకంగా 12 శాతం పెరిగిందని తెలుస్తోంది. జెన్ జడ్ యువత.. ఇండిపెండెంట్ ఉమెన్స్.. యువకులు ఎక్కువగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని ధరించడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. పైగా రకరకాల అయిన వజ్రాలను దిగుమతి చేసుకొని.. ఆభరణాలుగా రూపొందించుకుంటున్నారు.
వజ్రాల హారాలు.. వజ్రాలతో పొదిగిన ఉంగరాలు.. వజ్రాల తో రూపొందించిన లాకెట్లు ధరిస్తున్నారు.. వీటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అందువల్ల వజ్రాల వినియోగంలో భారత్ ఏకంగా చైనా, జపాన్ దేశాలను దాటేసింది. ఇప్పుడు నెంబర్ 2 స్థానంలోకి వచ్చేసింది. ఇదే స్థాయిలో దిగుమతులు కనుక కొనసాగితే భారత్ కచ్చితంగా అమెరికా దేశాన్ని దాటేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పైగా మనదేశంలో వజ్రాలను సానపెట్టే ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ గతంలో సాన పెట్టిన వజ్రాలను ఇతర దేశాలకు విమర్శ చేసేవారు. కొంతకాలంగా మనదేశంలోనే ఎక్కువగా వినియోగం అవుతున్నాయి.
వజ్రాలను కూడా రకరకాలైన వాటిని భారతీయులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పింక్.. గోల్డెన్.. వైట్ డైమండ్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. హై ప్రొఫైల్ వ్యక్తులు ఎక్కువగా వజ్రాలను ధరిస్తున్నారు. ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో.. మెట్ గాలా లో వజ్రాలతో రూపొందించిన ఆభరణాలను సెలబ్రిటీలు ధరించారు. అమెరికా సెలబ్రిటీలను మించి ఇండియన్ సెలబ్రిటీలు డైమండ్ జ్యువెలరీ ధరించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వజ్రాల డిమాండ్ ఇలాంటి కొనసాగితే బంగారం మాదిరిగానే వాటి మీద కూడా సుంకాన్ని భారత ప్రభుత్వం విధించే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
