
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు రెండు శుభవార్తలు చెప్పింది. అదే సమయంలో కస్టమర్లకు ఒక విషయంలో అలర్ట్ చేసింది. దేశంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ లలో ఏకంగా 1,14,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఆరు రోజులు పని దినాలుగా ఉండగా ఇకపై కేవలం ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా ఉండనున్నాయి.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఇకపై శనివారం ఎల్‌ఐసీ ఆఫీసులు పని చేయవు. అందువల్ల ఎల్‌ఐసీ బ్రాంచ్ లలో పనులు ఉన్నవాళ్లు సోమవారం నుంచి శుక్రవారం లోపే పనులు పూర్తి చేసుకోవాలి. దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ పాలసీల వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రయోజనం చేకూరనుంది.
తక్కువ మొత్తం ప్రీమియం నుంచి కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించే పాలసీలు సైతం ఎల్‌ఐసీలో ఉండటం గమనార్హం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ ఉద్యోగులకు 25 శాతం వేతనాలను పెంచింది. మరోవైపు ఎల్‌ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఎల్‌ఐసీ ఐపీవో పనులు ప్రారంభం కానున్నాయి.
ఎల్‌ఐసీ ఉద్యోగులకు కేంద్రం వరుస శుభవార్తలు చెబుతుండటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం, ఆదివారం ఎల్‌ఐసీ ఉద్యోగులకు సెలవు కావడంతో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.