Maruthi Grand Vitara
Millage Car: మార్కెట్లోకి వేల కొద్దీ కార్లు వస్తున్నాయి. వినియోగదారులకు అనుగుణంగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నారు. కానీ మారుతి కార్లకు ఉన్న క్రేజే వేరు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వాటికి వినియోగదారులు ఎక్కువగా లైక్ చేస్తారు. దీంతో వీటి అమ్మకాలు విపరీతంగా సాగుతూ ఉంటాయి. తాజాగా మారుతి కంపెనీకి చెందిన ఓ కారు మంచి సేల్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు ధర కూడా అనుగుణంగా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మరి ఆ కారు ఏదంటే?
దశాబ్దాలుగా మారుతి కార్లు అలరిస్తున్నాయి. వాటిలో గ్రాండ్ విటారా ఒకటి. కాంపాక్ట్ ఎస్ యూవీగా మార్కెట్లోకి వచ్చిన ఇది ఎస్ యూవీ కోరుకునేవారికి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ మోడల్ విషయానికొస్తే.. ఇందులో 1.5 లీటర్ డ్యూయెల్ జెట్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉన్నాయి. మారుతి గ్రాండ్ విటారాను 2023 సెప్టెంబర్ లో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇందులో విటారా సిగ్మా, జీటా, జీటా ప్లస్ వంటి మొత్తం ఆరు వేరియంట్లు ఉన్నాయి.
మొత్తంగా గ్రాండ్ విటారా ధర రూ. 12.50 లక్షల నుంచి రూ. 23 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అన్ని వేరియంట్లో ఓవరాల్ గా19.38 నుంచి 27.38 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారును సొంతం చేసుకుంటే 15 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకం కలగకుండా రన్ అవుతుందని అంటున్నారు. మైలేజ్ తో పాటు ఎంతో సౌకర్యంగా ప్రయాణించాలనుకునేవారికి గ్రాండ్ విటారా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Mileage car this car is the king of mileage no accident for 15 years