MG ZS EV : MG మోటార్స్ నుంచి రిలీజైన ZS EV అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి ఇప్టి వరకు 19 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఈ ప్రయాణంలో 27 మిలియన్ కిలోల కార్బన్ డై యాక్సైడ్ ను ఆదా చేయగలిగింది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ సందర్భంగా CO2లను అదుపు చేయగల వాహనాల విభాగంలో భారత్ కు చెందిన MG ZS EV వెహికిల్ విజయం సాధించినట్లేనని నిర్వాహకులు అంటున్నారు. ఈ వాహనం నుంచి ప్రతీ కిలోమీటర్ కు కేవలం 144.9 గ్రాముల CO2 మాత్రమే వెలువడుతుండడంతో పర్యావరణంపై తాము దృష్టి పెట్టామని చెబుతున్నారు.
భారతదేశంలో మొట్టమొదటి ఈయూ వెహికిల్స్ లో MG ZS EV నిలుస్తుంది. ఇందులో సూపర్ ఫాస్ట్ చార్జర్లు, ఏసీ ఫాస్ట్ చార్జర్లు, ఫోర్టబుల్ ఛార్జర్లు, మొబైల్ సపోర్టింగ్ ఛార్జర్లు ఉన్నాయి. ఈయూ ఛార్జింగ్ కోసం దేశంలోని చాలా ప్రాంతాల్లో 1000Ac చార్జర్లను అందుబాటులో ఉంచింది. ఇక ఇళ్లల్లోనూ ఈ కంపెనీకి చెందిన చార్జర్లను ఉచితంగా ఇన్ స్టాల్ చేస్తోంది. ఈ వెహికిల్ 50.3kWH టెక్నాలజీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 461 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. 176 పీఎస్ పవర్ ను అందించే బెస్ట్ ఇన్ క్లాస్ మోటార్ ను కలిగి ఉంది. కేవలం 8.5 సెకన్లలలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది.
1924లో బ్రిటన్ లో స్థాపించబడిన మోరిస్ గ్యారేజెస్ వాహనాలు, వారికి సంబంధించిన స్పోర్ట్స్ కార్లు ప్రసిద్ధి చెందినవి. MG వాహనాలను కేవలం బ్రిటీష్ ప్రధానులు, రాజకుటుంబానికి చెందిన వారు మాత్రమే వాడేవారు. ఆ తరువాత యూకే లోని అబింగ్ డన్ లో 1930లో స్థాపించబడిన ఎంజీ కార్ క్లబ్ వేలాది మందిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇది కార్ల బ్రాండ్లలో అతిపెద్ద క్లబ్ లల్లో ఒకటి. గత 100 ఏళ్లుగా ఎంజీ మోటార్స్ వినూత్న బ్రాండ్ గా నిలుస్తోంది.
భారత్ తో గుజరాత్ లో MG మోటార్స్ ను స్థాపించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. కేంద్ర వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,20,000 వాహనాలు, 3,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. మొబిలిటీ ద్వారా నడిచే అత్యాధునిక ఆటోమేకర్ వాహనాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో తొలి ఇంటర్నెట్ SUV వెహికిల్ గా MG ZS EVని పరిచయం చేసింది. ఇప్పుడు అది అనేక మైళ్లు దాటి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.