
Alert to Bank customers: దేశంలో బ్యాంకులు తగ్గుతున్నాయి. ఒకబ్యాంకును మరో బ్యాంకు కొనుగోలు చేస్తూ పోతున్నాయి. దీంతో బ్యాంకుల సంఖ్య క్రమేపీ తక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు సిటీ బ్యాంకును కొనుగోలు చేసింది. ఇక మీద సిటీ బ్యాంకు సేవలు ఉండవు. ఇక యాక్సిస్ బ్యాంకులో విలీనం కావడంతో మార్చి 1 నుంచి సిటీ బ్యాంకు పేరు కనిపించదు. ఎక్కడైతే సిటీ బ్యాంకు ఉంటుందో అది కాస్త యాక్సిస్ బ్యాంకుగా మారుతుంది. ఈ క్రమంలో సిటీ బ్యాంకు ఖాతాదారులు కొన్ని సూచనలు పాటించాల్సిందే.
బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నెంబర్లు, చెక్ బుక్స్, ఐఎఫ్ఎస్ సీ కోడ్స్ వంటివి అన్ని ఎప్పటిలాగే ఉంటాయి. సిటీ మొబైల్ యాప్ లేదా సిటీ బ్యాంకు ఆన్ లైన్ సేవలు కూడా అలాగే మనుగడలో ఉంటాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రివార్డు పాయింట్ల విషయంలో ఎర్నింగ్ రేషియో, రిడంప్సన్ ప్రాసెస్ స్థిరంగానే ఉంటుంది. ఇందులో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సిటీ బ్యాంక్ ఇండియా నుంచి మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే ఆ పాలసీ ఫీచర్లు కూడా అలాగే ఉంచుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు వాటికి సేవలు అందిస్తుంది.
సిటీ బ్యాంకు కస్టమర్లు ఇక మీదట యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉచితంగా ట్రాన్జాక్షన్లు కొనసాగించుకోవచ్చు. ఉచిత లిమిట్ దాటితే మాత్రం చార్జీలు వేస్తుంది. సిటీ గోల్డ్ బ్యాంకింగ్ ప్రివిలైజేస్ ఇక ఈ రోజు నుంచి ఉండవు. ఈ సర్వీసులను రద్దు చేస్తారు. సిటీ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ల విషయంలో ప్రస్తుత డిపాజిట్లపై వడ్డీరేటు అలాగే ఉంటుంది. కొత్త ఎన్ఆర్ఐ డిపాజిట్లకు మాత్రం యాక్సిస్ బ్యాంకు రేట్లు అమలవుతాయి.
మ్యాచువల్ ఫండ్స్ పీఎంఎస్, ఏఐఎఫ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ మెంట్లు అన్ని యాక్సిస్ బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ అవుతాయి. సిటీ బ్యాంకు నుంచి గృహ రుణాలు తీసుకుంటే దానికి సిటీ బ్యాంక్ మోర్ట్ గేజ్ ప్రైమ్ లెండింగ్ రేటు, బేస్ రేటు, ఎంసీఎల్ ఆర్ వంటివి ప్రామాణికంగా నిలుస్తాయి. వీటిలో ఎలాంటి మార్పు రాదు. సిటీ బ్యాంక్ కార్డుకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాటికి పరిష్కారం లభించడం కష్టమే. దీంతో సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కావడం కష్టమే. దీంతో సిటీ బ్యాంకు స్థానంలో యాక్సిస్ బ్యాంకు కనిపిస్తుంది. ఇక సిటీ బ్యాంకు శకం ముగిసినట్లే.