Mercedes-Benz GLS: కారు కొనుగోలు చేయాలని కొంతమంది అనుకుంటే.. లగ్జరీకాలలో విహరించాలని మరికొందరు కలలు కంటారు. లగ్జరీకాలలో ప్రయాణం చేస్తే స్వర్గంలో ఉన్నట్లు ఉంటుందని భావించేవారు చాలామంది ఉన్నారు. వీరి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఖరీదైన కారణం మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. వీటిలో Mercedes కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని నుంచి వచ్చిన బెంజ్ కారు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇది వివిధ వేరేటిలో వచ్చి ఇప్పటికే యూత్ తో పాటు ధనిక వర్గాలను విపరీతంగా ఆకర్షించింది. బెంజ్ కార్ ను కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తి ఉండడంతో వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అయితే తాజాగా మెర్సీ డేస్ నుంచి కొత్త వేరియంట్ మార్కెట్లోకి వచ్చింది. దాని గురించి వివరాల్లోకి వెళితే..
జర్మనీకి చెందిన మెర్సీ డేస్ కంపెనీ తాజాగా కొత్త మోడల్ మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ ఎస్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. SUV వీరి ఇంట్లో ఉన్న లగ్జరీ లాడ్జ్ కారు అయిన ఇది ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి 16 వేలకు పైగా యూనిట్ల విక్రయాలను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన జి క్లాస్ నుంచి విస్పర్ ఐన ఈ కారు స్పోర్ట్స్ గా ఉంటూ.. డిజైన్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కొత్త కారులో అదనపు ఫంక్షన్స్ ఉండడంతో దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ కారు లో ప్రత్యేకంగా ఎయిర్ ఇన్ లెట్ లు ఉన్నాయి.. మల్టీ ఫంక్షన్స్ స్పోర్ట్స్ స్టీరింగ్ తో కలిగి ఉన్న ఈ కారులో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. బ్లాక్ రబ్బర్ స్టడ్ ఆకర్షించనున్నాయి. 3 ట్విన్ స్పోక్ డిజైన్ తో పాటు హై పర్ఫామెన్స్ ఇచ్చే డిస్క్ బ్రేకులు ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఎయిర్ అవుట్ లెట్స్ ఆకర్షిస్తాయి.
Also Read: రూ.2 లక్షలకే వ్యాగన్ఆర్.. వెంటనే త్వరపడండి
ఇంజిన్ విషయానికొస్తే కొత్త బెంజ్ లో 3.0 లీటర్ పెట్రోల్ తో కూడిన 6 సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు. ఈ ఇంజిన్ 375 బీహెచ్ పీ పవర్ తో పాటు 500 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.అలాగే ఇందులో డీజిల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 362 బీహెచ్ పీ పవర్ తో పాటు 750 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తాయి.
ఇక ఈ కారుకు 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 4 స్లాట్ రేడియేటర్ గ్రిల్ ను అమర్చారు. రియర్ ఏప్రాన్ ట్రిమ్ స్ట్రిప్ ను చేర్చారు. సిల్వర్ క్రోమ్ తో తయారు చేసిన స్టీరింగ్ తో పాటు బ్లాక్ ఫ్లోర్ మ్యాట్స్ , లెదర్ తో తయారు చేసిన ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన బెంజ్ లో కంటే ఇందులో అదనపు ఫీచర్స్ ఉండడంతో దీని కొనుగోలుకు ఆసక్తి పెరుగుతోంది.