Meet Surya Varshan: వ్యాపారం చేయాలని అందరూ అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఇందులో రాణిస్తారు. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం చాలా కష్టతరమైన పని. ఉద్యోగం చేసేవారు కేవలం తమ శ్రమను ఖర్చుపెడితే సరిపోతుంది. కానీ వ్యాపారం చేసేవారు శ్రమను ఖర్చు పెడుతూనే.. మెదడుకు పదును పెడుతూ ఉండాలి.. సమాజ పరిస్థితులను అర్థం చేసుకోవాలి.. ఇదే సమయంలో మంచి ప్రోడక్ట్ అందించాలన్న ఆలోచన కూడా ఉండడంతో సమాజంలో ఆదరణ లభించడంతోపాటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ ఆలోచన కలిగిన ఒక యువకుడు తనకు వచ్చిన పాకెట్ మనీని ఉపయోగించి చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు రూ. పది కోట్ల సామ్రాజ్యానికి చేరింది. అతి చిన్న వయసులో ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన యువకుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా?
తమిళనాడులోని మదురై జిల్లా తుత్తుకుడి చెందిన సూర్య వర్ష వయసు 21. ఇతడు చిన్నప్పటి నుంచి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. ముఖ్యంగా కొంతమంది గాయాలు అయినప్పుడు ఉప్పును ఒక బట్టలో చుట్టి కాపడం పెట్టేవారు. ఇలా ఉప్పుతో గాయాలు మానుతాయా? అని అనుకునేవాడు. అయితే ఉప్పులో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన అతనిలో వదిలింది. దీంతో ఉప్పు గురించి తీవ్రంగా సెర్చ్ చేశాడు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండడంతో.. ఇవి కండరాల నొప్పులను తగ్గిస్తాయని గ్రహించాడు. అయితే ఉప్పుతో పాటు ఏదైనా పదార్థాన్ని కలిపి మెడిసిన్ తయారు చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా తమ అమ్మానాన్న ఇచ్చిన పాకెట్ మనీ రూ.200 తో మందారం పువ్వు, బార్లీ, వేపాకు తో కలిపి బాత్ సాల్ట్ ను తయారు చేశాడు. దీనికి Naked Nature అని పేరు పెట్టాడు. అయితే ఇందులో ఎలాంటి రసాయనాలు కలపలేదు. ఈ బాత్ సాల్ట్ ను విక్రయించడానికి ప్రత్యేకంగా వెబ్సైట్ ను క్రియేట్ చేశాడు.
ఒకసారి ఒక సిద్ధ వైద్యుడు దీని కొనుగోలు చేసి మెచ్చుకున్నాడు. అంతేకాకుండా పదేపదే దేని కొనుగోలు చేయడంతో అతనికి మరింత నమ్మకం పెరిగింది. ఆ తర్వాత కలబంద, రేపు ఆకు, ఉప్పు కలిపి కొత్త సబ్బులు తయారు చేశాడు. అయితే ఆ తర్వాత మధురైలోని ఒక కళాశాలకు వెళ్లి యూట్యూబ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. దీని ద్వారా వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు. దీంతో naked nature లో భాగంగా సబ్బు, చర్మ మరియు జుట్టు సంరక్షణ వంటి 70 ఉత్పత్తులను తయారు చేశాడు. ఇలా అన్ని రకాల ప్రోడక్ట్లను మార్కెటింగ్ ద్వారా అభివృద్ధి చేశాడు.
2021 -22 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యాపారం ద్వారా అతడు రూ.56 లక్షలు సంపాదించాడు. ఆ తర్వాత వీటికి ఆదరణ పెరగడంతో కొంతమంది వైద్యులు, సెలబ్రిటీలు సైతం కొనుగోలు చేసి వీటిని మార్కెటింగ్ చేశారు. అలా ఈ యువకుడు రూ.10 కోట్ల వరకు టర్నోవర్ సాధించాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.