False Pregnancy: పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్కరూ సంతానాన్ని కోరుకుంటుంటారు. కొంతమంది కొన్నాళ్లు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లల్ని కనాలని చూస్తే.. మరికొందరు వెంటనే తల్లిదండ్రులు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటిలో వాంటింగ్ రావడం.. పీరియడ్స్ ఆగిపోవడం.. అస్వస్థతగా ఉండడం.. అధికంగా అలసిపోవడం.. తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఇవే లక్షణాలు ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాదు.. దీనినే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటారు. వైద్య పరిభాషలో సూడో సైసిస్ అంటారు. ప్రెగ్నెన్సీ రాకున్నా కూడా.. వచ్చినట్లు ఫీల్ అయ్యే పరిస్థితినే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఏమైనా ప్రమాదమా?
ఫాల్స్ ప్రెగ్నెన్సీ గురించి ఇటీవల ఎక్కువగా చర్చ సాగుతోంది. చాలామందికి ప్రెగ్నెన్సీ లక్షణాలు ఇదివరకే చూసి ఉండి కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకపోవడం వంటివి జరగవచ్చు. కానీ ప్రత్యేకంగా దీని ఫాల్స్ ప్రెగ్నెన్సీ అనుకోలేదు. అయితే ఈ సమయంలో మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. వీటిలో సాధారణంగా పీరియడ్స్ ఆగిపోతాయి. పొత్తికడుపు పెరిగినట్లు అవుతుంది. అయితే ఇలా కడుపు పెరగడానికి గ్యాస్ లేదా ఫ్యాట్ స్టోరేజ్ అని అనుకోవాలి. అలాగే వాంతులు, ఉదయం అస్వస్థత ఉంటాయి. కానీ ఇవి జలుబు, విరక్తి వల్ల వచ్చేవి అని గ్రహించాలి. కడుపులో బిడ్డ కదిలినట్లు అనిపిస్తుంది. శరీరం బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. ప్రత్యేకంగా బాడీ పెయిన్స్ ఉంటాయి.
అయితే ఇలాంటి లక్షణాలు ఉంటే సాధారణంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటారు. కానీ కన్ఫామ్ కాకున్నా కూడా అవే లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇలా సంప్రదించినప్పుడు అడ్రస్ సౌండ్ స్కాన్, హార్మోన్ టెస్ట్ వంటివి చేస్తారు. ఈ టెస్టులు చేసిన తర్వాత గర్భం దార్చలేదు అని నిర్ధారణ అయితే.. మానసికంగా తనకు గర్భం రాలేదు అని సిద్ధపడేలా చేయాలి. ఎందుకంటే చాలామందికి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు తాము ప్రెగ్నెన్సీ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ టెస్టుల ద్వారా నిర్ధారణ అయిన తర్వాత మానసికంగా కుంగిపోతారు. ఇలాంటి వారికి సైకలాజికల్ గా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా హార్మోనల్ చికిత్స కూడా చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం ఉండి భావోద్వేగాలను నియంత్రించే ప్రయత్నం చేయాలి.
సూడో సైసిస్ అనేది ఎక్కువగా 20 నుంచి 35 ఏళ్ల లోపు మహిళల్లో కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో సాధారణంగా ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూస్తారు. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ప్రెగ్నెన్సీ కాకుండా కూడా లక్షణాలు ఉంటే సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. దీనిపై నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ పై ప్రభావం ఉంటుందని కొందరు తెలుపుతున్నారు.