Mattar Aera : మాటర్ కంపెనీ తన గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరాను అధికారికంగా ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1,83,308 (ఎక్స్-షోరూమ్). ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌తో పాటు మాటర్ ఎరా లాంచ్ ప్రకటన రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులకు అనేక ప్రారంభ లాభాలను అందిస్తోంది.
మాటర్ ఎరా ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌పై భారీ ఆఫర్ ప్రకటించారు. దీని ధర ఏకంగా రూ.39,827 వరకు తగ్గింది. ఇందులో ప్రత్యేక లాంచ్ ధర, ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేకమైన తగ్గింపు, లిమిటెడ్ టైంకు మాత్రమే అందుబాటులో ఉండే క్రెడిట్ కార్డు ఆఫర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ మాటర్ ఎరా టాప్ మోడల్ ధర రూ.1,93,826 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది.
Also Read : ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్.. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్‌లో ఎవరు టాప్ లో ఉన్నారంటే ?
ఆఫర్ కొద్ది కాలమే
మాటర్ కంపెనీ తెలిపిన ప్రకారం.. దేశంలో లేటెస్ట్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక లిమిటెడ్ టైం ప్రయత్నంలో భాగం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి జరుగుతున్న పెద్ద ప్రయత్నంలో ఈ లాంచ్ ఒక భాగమని కంపెనీ గట్టిగా చెబుతోంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 172 కి.మీ ప్రయాణం
మాటర్ ఎరా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టింది. ఇది 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఎరాలో 5 kWh, IP67-రేటెడ్ బ్యాటరీ కూడా ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 172 కిలోమీటర్ల (కంపెనీ చెప్పుతుంది) వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ బైక్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు అదుర్స్
మాటర్ ఎరాలో నావిగేషన్, మీడియా, కాల్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌ల కోసం సపోర్ట్‌తో 7-ఇంచుల టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ ఉంది. ఈ బైక్‌లో హోమ్ ఛార్జింగ్ కోసం 5-amp సాకెట్‌తో అనుకూలమైన ఆన్‌బోర్డ్ ఛార్జర్ కూడా ఉంది. రైడర్ ఒక మొబైల్ యాప్ ద్వారా దీనికి కనెక్ట్ కావచ్చు. ఇందులో డేటా యాక్సెస్, రిమోట్ లాకింగ్, జియో-ఫెన్సింగ్, మెయింటెనెన్స్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.