Maruti Wagon R: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి. దేశంలోని ఇతర కంపెనీలకన్నా ముందే 2026 మోడల్ కార్లను విడుదల చేసింది. మార్కెట్‌లో కీలక భాగస్వామిగా ఉన్న మారుతి. కొత్త ఏడాది ప్రారంభమైన వారం రోజుల్లోనే కొత్త మోడల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మారుతి వ్యాగన్ ఆర్ – 2026 లేటెస్ట్ వర్షన్ విడుదైంది. ఇదే సమయంలో మారుతి సుజుకి వాగన్ ఆర్ – 2025 మార్కెట్‌లో ఇప్పటికీ కార్ లవర్స్‌కు అందుబాటులో ఉంచింది. నగర రోడ్లు, గ్రామీణ మార్గాలకు సరిపోయే ఈ హాచ్‌బ్యాక్ 25+ కి.మీ./లీ. మైలేజ్‌తో ఇంధన ఖర్చును తగ్గిస్తుంది.
సరిపడా ఎత్తు, ఆకర్షణీయ రూపం
మారుతి వ్యాగన్ ఆర్ 1655 మి.మీ. ఎత్తు, 145 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌తో నీటి మట్టాలను ఎదుర్కొంటుంది. ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, రూఫ్ రైల్స్, బ్లాక్ స్టీల్ వీల్స్ యువతను ఆకర్షిస్తాయి. టాఫీ బ్రౌన్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 976 మి.మీ. హెడ్‌రూమ్‌తో ముందు–వెనుక సౌకర్యవంతం. 7–ఇంచ్ టచ్‌స్క్రీన్ (ఉన్నత వేరియంట్లు), వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. 341–768 లీ. బూట్ స్పేస్, వెనుక ఏసీ వెంట్‌లు, యూఎస్‌బీ పోర్ట్‌లు రోజువారీ ప్రయాణాలను సులభం చేస్తాయి.
ఇంజిన్ ఎంపికలు..
1.0L K10C (67PS) మాన్యువల్/AGS 2425 కి.మీ./లీ. 1.2L K12N (90PS) CNG ఆప్షన్‌తో 34 కి.మీ./కేజీ. ఐడిల్ స్టార్ట్–స్టాప్, రీజెన్ బ్రేకింగ్ ఇంధనాన్ని ఆదా చేస్తాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS+EBD, రివర్స్ సెన్సార్లు స్టాండర్డ్. ESP, (ZXIÌZ), ISOFIX, స్పీడ్ సెన్సింగ్ లాక్‌లు ఉన్నాయి.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు..
కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, అలాయ్ వీల్స్ (ZXI). డిజిటల్ క్లస్టర్ మైలేజ్ ట్రాక్ చేస్తుంది. మాక్‌ఫెర్సన్ సస్పెన్షన్ రోడ్ అస్తవ్యస్తతలను గ్రహిస్తుంది. LXI రూ.4.99 లక్షలు, ZXI+AT రూ.6.95 లక్షల వరకు. సీఎన్‌జీ మరింత ఎక్కువ. ఏడాది సర్వీస్ చార్జి రూ.2 వేలు ఉంటుంది.
సాంట్రో, టియాగో కంటే స్పేస్, మైలేజ్ మెరుగు. క్విడ్ ధరలో రీఫైన్మెంట్ లోపిస్తుంది. వాగన్ ఆర్ 2025 స్పేస్, ఆర్థికత, ఎస్‌యూవీలుక్‌లను బడ్జెట్‌లో అందిస్తుంది. మొదటి కారు కొనుగోలుదారులకు పర్ఫెక్ట్.