Maruti Wagon R 2026: Maruthi Suzuki కంపెనీ నుంచి కార్లు మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ కంపెనీ కార్లు తక్కువ ధరతో పాటు మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రీమియం కార్లను కూడా తీసుకురావడంలో ఈ కంపెనీ ప్రత్యేకత చాటుకుంటుంది. అయితే దశాబ్దాల కిందట సెడాన్ విభాగంలో వచ్చిన Wagon R కారును ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ కారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కారు అప్డేట్ అయిన ఫీచర్లతో పాటు నేటి తరానికి ఉపయోగపడేవిధంగా దీనిని తీర్చిదిద్దారు. మరి ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Wagon R కొత్త కారు డిజైన్ విషయానికొస్తే.. ఇందులో కొత్తగా క్విల్టెడ్ ఫాబ్రిక్ సీట్లు, కూల్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేశారు. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉండేందుకు క్యాబిన్ అమర్చారు. ఇందులో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎలాంటి అలసట లేకుండా ప్రయాణం చేయవచ్చు. బూట్ స్పేస్ తో పాటు సాప్ట్ టచ్ ను కలిగి ఉన్న ఈ కారు ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా స్మార్ట్ టెక్నాలజీని అమర్చారు. ఇందులో 7 అంగుళాల HD టచ్ స్క్రీన్, వైర్ లెస్ అండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఉంచారు. అలాగే 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 64రంగుల యాంబియంట్ లైట్స్, 6 స్పీకర్ స్టీరింగ్ ఆడియో నాణ్యతను అందిస్తుంది. ఈ కారులో ఏసీ వేరియంట్, వైర్ లెస్ ఛార్జింగ్, ఆటో డిమ్మింగ్ లు లాంగ్ జర్నీ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది.
వ్యాగన్ ఆర్ బాహ్య డిజైన్ విషయానికొస్తే.. కారు 1.7 మీటర్ల పొడవు ఉండి.. చంకీ రూఫ్ రెయిల్ లు ఉండి.. 16 అంగుళాల డైమంట్ కట్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణనిస్తాయి. బోల్డ్ LED DRLలు హనీకాంబ్ గ్రిల్ లు ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్స్, స్కిడ్ ప్లేట్స్ వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి. సులభమైన పార్కింగ్ కోసం 3.8 మీటర్ల పొడవు ఉండనుంది. ఇది కాంపాక్ట్ కారు అయినప్పటికీ SUV వలె తలపిస్తుంది..
ఈ కారు ఇంజిన్ వేరె లెవల్ అనుకోవచ్చు. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటర్ ఇంధనానికి 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 24 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తాయి. అలాగే డ్రైవ్ మోడ్, పవర్ ఎకోలు డ్రైవర్ కు అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఉండే మైల్డ్ హైబ్రిడ్ బ్యాటరీ కూడా ఇంజిన్ కు సపోర్టు గా ఉండనుంది. బ్యాటరీ రీజెన్ చేయడానికి ప్లగ్ అవసరం ఉండదు. ఇందులో CNG కూడా ఉండడంతో ఈ వేరియంట్ పై 34 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. సేప్టీ విషయానికొస్తే.. ఇందులో 360 డిగ్రీ కెమెరా సూట్ తో ప్రతీ దృశ్యం కనిఃపిస్తుంది. లెవల్ 2 ADAS టెక్నాలజీ ఓవర్ టేక్ సమయంలో అడాప్టివ్ క్రూయిజ్ బ్రేకింగ్ ను అందిస్తుంది. ఈ కారులో ఉండే 7 అంగుళాల స్క్రీన్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది.
Maruti Suzuki కార్లు అంటే ధర తక్కువ అని చాలా మంది భావన. వీరికి అనుగుణంగానే ఈ కారును రూ.5.49 లక్షల ప్రారంభధర నుంచి రూ.7.95 లక్షల వరకు విక్రయించనున్నారు.