https://oktelugu.com/

Maruti Suzuki: మారుతి నుంచి 40 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు రాబోతుంది.. ఎప్పుడో తెలుసా?

దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకి. వినియోగాదారుని అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ మోడళ్లను ఉత్పత్తి చేసింది.

Written By: , Updated On : August 23, 2023 / 02:53 PM IST
Maruti Suzuki
Follow us on

Maruti Suzuki: కారు కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా బెస్ట్ ఫీచర్స్ గురించి ఆలోచిస్తారు. అంతకంటే ముందే మైలేజీని ప్రధానంగా చూస్తారు. అయితే కొన్ని కార్లలో మైలేజీ, ఫీచర్స్ వేర్వేరుగా ప్రత్యేకంతో ఉంటాయి. కానీ వినియోగదారులు మాత్రం మంచి ఫీచర్స్ తో పాటు ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు ఏవున్నాయో సెర్చ్ చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కంపెనీలు ఇప్పుడు అత్యధిక మైలేజీ ఇచ్చే మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిలో మారుతి నుంచి ఓ కారు లీటర్ కు 40 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చేలా తయారు చేసింది. ఇంత మైలేజీ ఇచ్చే ఆ కారు ఏదో తెలుసా? దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్తాం పదండి..

దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకి. వినియోగాదారుని అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ మోడళ్లను ఉత్పత్తి చేసింది. వీటిలో స్విప్ట్ ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకోవడంతో దానిని సొంతం చేసుకున్నారు. 2005లోనే స్విప్ట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ మార్పులతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు డిజైన్స్, ఫీచర్స్ అప్ గ్రేడ్ సాధించిన స్విప్ట్ ఇప్పుడు లేటేస్ట్ మోడల్ అందుబాటులోకి రాబోతుంది.

స్విప్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 తరాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఐదో తరంను మరింత ఆకర్షణీయంగా తయారు చేయడంతో పాటు బలమైన ఇంపాక్ట్ ను కలిగి ఉంది. దీని ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ , బ్యాటరీతో పాటు 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఏఆర్ బీఐ ధ్రువీకరించినట్లుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మోడల్ అత్యధికంగా కిలోమీటర్ కు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది 89 బీహెచ్ పీ , 113 ఎన్ ఎం టార్క్ పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా దీనిని అక్టోబర్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. భారత్ లో మాత్రం 2024 ప్రారంభంలో తీసుకురానున్నారు. ఇదివరకు ఉన్న స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ ను అనేక మార్పులు చేసి తీసుకొస్తున్నారు. ఈ మోడల్ లో వాయిస్ అసిస్ట్ తో కొత్త స్మార్ట్ ప్లే ప్రో తో పాటు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంది. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో ఆకట్టుకునే అవకాశం ఉంది.