Singer Raju Punjabi : సినిమాలకు కథ ,హీరో ఎంత ముఖ్యమో.. సింగర్ కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాలలో పాటల కారణంగా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసి హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి గాయకులను కోల్పోవడం సీని ఇండస్ట్రీకి తీర్చలేని లోటు. ప్రస్తుతం హర్యాన్వీ మూవీ ఇండస్ట్రీ ఇదే బాధ ఎదుర్కొంటోంది. 40 సంవత్సరాల హర్యానీ గాయకుడు రాజు పంజాబీ..హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
గత కొద్ది కాలంగా కామెర్లతో బాధపడుతున్న అతను హాస్పిటల్లో చికిత్స అందుకుంటున్నారు. చికిత్స జరిగే సమయంలో అతని ఆరోగ్యం కుదుటపడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. కానీ డిస్చార్జ్ అయిన కొద్ది రోజులకి తిరిగి ఆరోగ్యం క్షమించడంతో హాస్పిటల్లో రీ జాయిన్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూనే అతను తుది శ్వాస విడిచారు. అతని అంత్యక్రియలు రాజస్థాన్‌లోని స్వస్థలమైన రావత్‌సర్‌లో నిర్వహించబడతాయి.
ఈ సందర్భంగా రాజు పంజాబీ మృతి గురించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం వ్యక్తం చేశారు. రాజు పంజాబీ లాంటి గాయకుల మరణం సినీ మరియు సంగీత పరిశ్రమకు కోలుకోలేని నష్టం అని ఆయన పేర్కొన్నారు. అతను తన X అదే ఇంతకుముందు ట్విట్టర్ లో రాజు పంజాబీ మరణం పై తన బాధను వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి తన పవిత్ర పాదాల వద్ద చోటు కల్పించాలని.. రాజు పంజాబీ కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ..ఓంశాంతి అని ముగించారు.
అలాగే గాయకుడు కేడీ దేశి రాక్.. హాస్పిటల్ బెడ్ పై ట్రీట్మెంట్ పొందుతున్న రాజు ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ “రాజు వాపిస్ ఆజా..”రాజు తిరిగి వచ్చేయ్..”అని క్యాప్షన్ పెట్టారు. రాజు మృతి పై పలువురు అభిమానులు తమ విషాదాన్ని వ్యక్తం చేస్తూ డైమండ్ ఆఫ్ హర్యానా.. అంటూ అతని గురించి పోస్టులు పెడుతున్నారు. రాజు పంజాబీ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు…అతని మరణం అతని కుటుంబానికి ఒక తీర్చలేని లోటు.దేశీ దేశీ,” “ఆచా లగే సే,” “తు చీజ్ లాజవాబ్,” “భాంగ్ మేరే యారా నే,” “లాస్ట్ పెగ్,” వంటి ఎన్నో హిట్ పాటలు రాజు పంజాబీ ని బాగా పాపులర్ చేశాయి. అలాంటి ఒక అద్భుతమైన గాయకుడి అకాల మరణం హర్యాన్వీ సంగీత పరిశ్రమ ను దిగ్భ్రాంతికి గురి చేసింది.