Maruti Suzuki WagonR Sales: రోజురోజుకు వినియోగదారుల అవసరాలు పెరిగిపోతున్నాయి. ఏదైనా అవసరం కోసం ఇంటింటికి ద్విచక్ర వాహనం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనం ధరలోనే కార్లు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా బైక్ లాగే కార్లు కూడా అంతే మైలేజ్ ఇవ్వడంతో చాలామంది వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి మైలేజ్ ఇచ్చే కార్లలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్ ఒకటి. ఈ కారు దశాబ్దాల కిందటే మార్కెట్లోకి వచ్చి ఇప్పటికీ అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో ఉండే ఫీచర్లు, మెయింటెనెన్స్ ఖర్చు తగ్గడం వంటివి మధ్యతరగతి ప్రజలకు ప్లస్ గా మారుతున్నాయి. దీంతో చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. 2025 సంవత్సరంలో ఈ కారు ఎన్ని యూనిట్లు అమ్మకాలు జరుపుకుందంటే?
Maruti Suzuki WagonR ప్రతి ఏడాది ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. ఈ కారుతో పోటీపడి ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చిన దీని అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఇందులో ఉండే ఇంజన్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారులో 1 లీడర్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 67 బిహెచ్పి పవర్, 89 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే మరో ఇంజన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 90 పిఎస్ పవర్ తో పాటు 113 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. వీటితోపాటు CNG ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 57 పిఎస్ పవర్ తో పాటు 82ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇది 23 నుంచి 34 కిలోమీటర్ల మైలేజ్ వరకు ఇస్తుంది.
ఇలాంటి ఇంజన్ లు ఉండడంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉండడంతో బడ్జెట్లో కారు కొనాలని అనుకునేవారు ఈ కారు పైన ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ కారు అమ్మకాలు ప్రతి ఏడాది నెంబర్ వన్ స్థానంలోనే ఉంటున్నాయి. ఇలాగే 2025 సంవత్సరంలో కూడా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్ లెవల్ లో దూసుకుపోయాయి. ఈ ఒక్క సంవత్సరంలో 1,94,238 యూనిట్లు డెలివరీ అయ్యాయి. దీంతో ఈ కారు కొన్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
రోజువారి వినియోగదారులతో పాటు రెండో అవసరానికి కారు ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది వ్యాగన్ఆర్ ను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం.. కార్యాలయ అవసరానికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా అనుకుంటున్నారు. వచ్చే కాలంలో కూడా ఈ కారు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.