Maruthi Suzuki: కొత్త Dzire లో ఈ ఫీచర్ కేక.. ఇంప్రెస్ అవుతున్న కార్ల వినియోగదారులు..

ఈ మోడల్ కు ఎలక్ట్రిక్ సన్ రూప్ విషయంలో ప్రత్యేక చర్చ సాగుతోంది. ఇది స్విప్ట్ కూడా లేదు. కొత్త స్పై షాట్ లు, సెగ్మెంట్ ఫస్ట్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ తో కలిగిన ఎలక్ట్రిక్ సన్ రూప్ ఉండనుందని తెలుస్తోంది.

Written By: Srinivas, Updated On : March 23, 2024 10:01 am

Maruthi Suzuki Dizire

Follow us on

Maruthi Suzuki:మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఏ కారు అయినా వినియోగదారులకు ఆకర్షిస్తుందని కొందరు అంటుంటారు. స్పెషిఫికేషన్, ఇంజిన్, తదితర విషయాల్లో ఈ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్న చర్చ సాగుతోంది. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వీటిలో Dzire ఒకటి. ఇప్పటికే రిలీజ్ అయినMaruthi Suzuki Dizire ఈ మోడల్ ఎంతగానో ఆదరణ పొందింది. అయితే దీనిని కొత్త తరహాలో మార్చి తీసుకురానున్నారు. Dzire Sedan గా వస్తున్న దీనిని ఇప్పటికే పరీక్షించారు. మరికొన్ని నెలల్లో హిమాచల్ ప్రదేశ్ లో పరీక్షించనున్నారు. అయితే ఇందులో ఊహించని ఫీచర్లు ఉండనున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అవేంటంటే?

మారుతి కొత్త డిజైర్ లో 1.2 లీటర్ 3 సిలిండర్ z సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 82 బీహెచ్ పీపవర్, 108 ఎన్ఎం టార్క్ ను ఉత్తత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇందులోపెట్రోల్ తో పాటు CNG వెర్షన్ దీని ఇంజిన్ మైల్డ్, హైబ్రిడ్ సిస్టమ్ కు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ కారులో సేప్టీ కోసం 360 డిగ్రీ కెమెరా, తేలికపాటి డ్యూయెల్ టోన్ పెయింట్ స్క్రీన్ ఉంది.

కొత్త తరం డిజైర్ లో ఎలక్ట్రిక్ సన్ రూప్ ను అమర్చనున్నారు. ఇది గ్లోబల్ వేరియంట్ లో అందుబాటులో లేదు. అలాగే వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో ఉంది. ఇందలో 9.0 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, మౌంటెడ్ క్రూయిజ్ కంట్రోల్, ఇన్ఫోటైన్మెంట్ బటన్ లతో పాటు మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఆకర్షిస్తుంది. ఈ ఫీచర్లు మారుతికి చెందిన కొత్త బాలెనో, స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ కార్లలో కూడా చూడొచ్చు. కొత్త డిజైర్ మరో ప్రత్యేకత ఏంటంటే సెడాన్ ప్లాట్ రూఫ్, పెద్ద గ్రిల్, క్లామ్ షెల్ బానెట్, ప్రత్యేక కట్ , క్రీజ్ తో పాటు బంపర్ కొత్త 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఆకర్షిస్తాయి.

ఈ మోడల్ కు ఎలక్ట్రిక్ సన్ రూప్ విషయంలో ప్రత్యేక చర్చ సాగుతోంది. ఇది స్విప్ట్ కూడా లేదు. కొత్త స్పై షాట్ లు, సెగ్మెంట్ ఫస్ట్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ తో కలిగిన ఎలక్ట్రిక్ సన్ రూప్ ఉండనుందని తెలుస్తోంది. ఇందులో స్టీరింగ్వీల్, సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ కన్సోల్, ఆటోమేటిక్ఏసీ, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటిని ఆకర్షించనున్నాయి.