Maruti Suzuki Mini Bus 2026: Maruti Suzuki కంపెనీ నుంచి అన్ని రకాల అవసరాలకు వాహనాలు మార్కెట్లోకి వస్తుంటాయి. సెడాన్ నుంచి కమర్షియల్ వెహికల్స్ వరకు వినియోగదారులకు అనుగుణంగా పనిచేస్తాయి. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కంపెనీ నుంచి Mini Bus మార్కెట్లోకి వచ్చింది. ఇది చిన్న వ్యాపారాలతో పాటు పాఠశాల, ఉమ్మడి కుటుంబం కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆకర్షణీయమైన డిజైన్తో పాటు ఆకట్టుకునే లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన ఫీచర్లు ఉన్నాయి. అయితే ధర మాత్రం అందుబాటులోనే ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ వ్యాన్ విశేషాలేవో చూద్దాం..
Maruti Suzuki Mini Bus 2026 డిజైన్ వేరే లెవెల్ అని అనుకోవచ్చు. దీనికి పెద్ద వెండి షీల్డ్ ఉండడంతో డ్రైవర్లకు కంఫర్ట్గా ఉండనుంది. అలాగే సేఫ్టీని కూడా అందిస్తుంది. బాహ్య డిజైన్ మొత్తం ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ప్రీమియం బ్రాండింగ్ వంటి క్లీన్ గ్రిల్, హలో జన్ హెడ్ లాంప్ వంటివి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ వ్యానుకు విశాలమైన డోర్స్ ఉండడంతో ఇన్ అవుట్ ఈజీగా ఉండనుంది. ఎలాంటి రోడ్లపై నైనా సులభంగా వెళ్లే విధంగా టైలర్ తయారు చేశారు.
ఈ బస్సు ఇంటీరియర్ కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉండనుంది. ప్రయాణికులకు తగినంత లెగ్ రూమ్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందు లేకుండా కూర్చోవచ్చు. ఇందులో మొత్తం 10 నుంచి 14 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. సీట్లు నాణ్యంగా ఉండడంతో పాటు ఒకదాని మధ్య మరొకటి స్వల్పదూరం ఉండడంతో సౌకర్యంగా ఉండనుంది. డోర్స్ పెద్దవిగా ఉండడంతో వెంటిలేషన్ సమస్యలు ఉండవని చెప్పవచ్చు. ఈ వ్యాన్ లో ఆకర్షణీయమైన టెక్నాలజీని అమర్చారు. పెద్ద స్క్రీన్ తో కూడిన డాష్ బోర్డుతో పాటు మ్యూజిక్ సిస్టం, యు ఎస్ బి చార్జింగ్ పోర్టు, నావిగేషన్ కోసం మొబైల్ హోల్డర్ వంటివి సౌకర్యాన్ని ఇస్తాయి. లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం డ్రైవర్లకు సపోర్ట్ ఇస్తుంది.
మారుతి సుజుకి మినీ బస్ లో పెట్రోల్ తో పాటుCNG ఇంజన్ కూడా అమర్చారు. రెండు ఇంజన్లు ఉండడంతో కావాల్సిన వేగంతో ప్రయాణం చేయవచ్చు. పవర్ డెలివరీ సజావుగా ఉంటూ ఎలాంటి రోడ్లపై నైనా వైబ్రేషన్ లేకుండా తీసుకెళ్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ ఉండడంతో సులభంగా గేర్ మార్చుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే గంటల పాటు డ్రైవింగ్ చేసిన కూడా ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది. ఈ మినీ బస్ లీటర్ ఇంధనానికి 20 నుంచి 25 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఈ వ్యాన్ లో ప్రత్యేకంగా సేఫ్టీ ఫీచర్స్ ను అమర్చారు. డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు సీట్ బెల్ట్ లు, ఫ్రంట్ డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్స్, అధిక వేరియంట్లలో ABS వంటి ఫీచర్స్ ప్రయాణికులకు అనుగుణంగా ఉంటాయి. ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నప్పటికీ దీనిని రూ.5 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.6.5 లక్షల వరకు విక్రయిస్తున్నారు.