Maruti Suzuki Fronx: మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా మారుతి సుజుకి నుంచి కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే ఈ కంపెనీ ఎక్కువగా సెడాన్, కాంపాక్ట్ కార్లను మాత్రమే తీసుకొస్తుందని అంటూ ఉంటారు. కానీ SUV వెహికిల్స్ ను కూడా తీసుకొస్తూ అలరిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి Fronx కారు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఇది హైబ్రిడ్ ఇంజిన్ తో రాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో తెలిపారు. మారుతి సుజుకి అంటే చాలామందికి నమ్మకమైన కంపెనీ. ఈ కంపెనీ నుంచి SUV కారు కొనాలని చాలామంది చూస్తుంటారు. మరి ఈ కారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
నేటి తరం వారు ఎక్కువగా SUV కార్లను కోరుకుంటున్నారు. వీరి కోసం మారుతి సుజుకి కంపెనీ కొత్తగా Fronx ను తీసుకొస్తుంది. ఈ వెహికల్ బాహ్య డిజైన్ విషయానికి వస్తే అద్భుతం అని చెప్పాలి. దీనికి LED హెడ్ లాంప్స్ ఆకర్షనీయంగా ఉన్నాయి. వెడల్పైన గ్రిల్, ప్రత్యేకంగా చెక్కబడిన బంపర్లు, రోడ్డు ప్రెజెన్స్ వంటివి ప్రీమియం లుక్ ను తీసుకొస్తాయి. స్టైలిష్ గా ఉండే అల్లాయ్ వీల్స్ ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో హైబ్రిడ్ ఇంజన్ ను అమర్చారు. వీటిలో ఒకటి 1.2 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. మరొకటి ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంది. ఈ రెండు ఇంజన్లు కలిపి 45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఒక SUV కారు ఇంతటి మైలేజ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. దీంతో నగర ప్రయాణికులతో పాటు లాంగ్ జర్నీ చేసే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
అలాగే ఈ కారులో వేరే లెవెల్ టెక్నాలజీని అమర్చారు. వీటిలో భాగంగా లెవెల్ 2 ADAS సేఫ్టీ ని ఇస్తుంది. ట్రూ ఇస్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పాట్ మానిటరింగ్ వంటివి సేఫ్టీని ఇస్తాయి. అలాగే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, EBD తో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి. ఈ కారు ఇంటీరియర్ లో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు. డాష్ బోర్డు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తో పాటు బిగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. అలాగే 360 డిగ్రీ కెమెరా, హెడ్ ఆఫ్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటివి ఉన్నాయి. ఇన్నర్లో విశాలమైన క్యాబిన్ ఉండడంతో సౌకర్యవంతమైన సీటింగ్ ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఈ కారు నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.12 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.