spot_img
Homeబిజినెస్Maruti Suzuki sales February 2026: ఫిబ్రవరి నెలలో మళ్లీ మారుతి సుజుకిదే పైచేయి.. గత...

Maruti Suzuki sales February 2026: ఫిబ్రవరి నెలలో మళ్లీ మారుతి సుజుకిదే పైచేయి.. గత ఏడాదితో పోలిస్తే మాత్రం డౌన్.. టాప్ టెన్ జాబితాలో ఏయే కార్లు ఉన్నాయంటే?

Maruti Suzuki sales February 2026: కొత్తగా కారు కొనాలని అనుకునే వారితో పాటు.. చిన్న ఫ్యామిలీ సొంతంగా కారు ఉండాలని అనుకుంటే ఎక్కువగా హ్యాచ్ బ్యాక్ వైఫై చూస్తారు. కంపెనీలు సైతం ఇలాంటి కార్లను ఎప్పుడూ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తాయి. అయితే 2026 ఫిబ్రవరి నెలలో హాట్ బ్యాక్ కారులలో మళ్లీ మారుతి సుజుకి కంపెనీకి చెందిన నాలుగు కార్లు టాప్ లెవల్ లో ఉన్నాయి. ఆ తర్వాత టాటా, హుందాయి, టయోటా కార్లు నిలిచాయి. అయితే మారుతి కార్లు సైతం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు క్షీణించడం గమనార్హం. మరి టాప్ 10 జాబితాలో ఏయే కార్లు ఎన్ని అమ్మకాలు జరుపుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఎప్పటిలాగే Maruti Suzuki కంపెనీకి చెందిన నాలుగు కార్లు ఫిబ్రవరి నెలలో అత్యధిక అమ్మకాలు జరుపుకున్నాయి. అయితే గతంలో ఈ కంపెనీకి చెందిన స్విఫ్ట్, బాలేనో, ఆల్టో కార్లు ఉండగా ఈసారి వ్యాగన్ఆర్ కారు మొదటి స్థానంలో నిలిచింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు 14,885 యూనిట్ల సేల్స్ ను నమోదు చేసుకుంది. ఇదే కారు 2025 ఫిబ్రవరిలో 19,879 సేల్స్ చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు 25% తక్కువ అమ్మకాలు జరుపుకుంది. కానీ ప్రస్తుతం టాప్ టెన్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీని తర్వాత స్విఫ్ట్ 14,883 కార్లు సేల్స్ అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 16,879 యూనిట్లు విక్రయించారు. గత ఏడాకో పోలిస్తే తొమ్మిది శాతం అమ్మకాలు తగ్గాయి. మూడో స్థానంలో ఇదే కంపెనీకి చెందిన బాలెనో 14,632 యూనిట్లు అమ్మకాలు చేసుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో 15,480 కార్లు అమ్మారు. కథ ఏడాదితో పోలిస్తే ఈ కారు ఐదు శాతం క్షీణ దశలో ఉంది.

మారుతి కంపెనీ తర్వాత TATA కు చెందిన టిఆర్ఓ కారు 7,040 యూనిట్ల అమ్మకాలతో ఐదు స్థానంలో నిలిచింది. ఈ కారు గత ఏడాది ఫిబ్రవరిలో 6,954 విగ్రహాలు జరుపుకుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఒక శాతం పెరిగినట్లు తెలుస్తోంది. హుందాయి i20 కారును 5,852 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదిలో ఈ కారును 3,627 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే 61 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే కంపెనీకి చెందిన i20 నియోస్ 5,589 యూనిట్ల సేల్స్ నమోదు అయింది. గత ఏడాదిలో 4,940 కార్లు సేల్స్ చేయడంతో గత ఏడాదితో పోలిస్తే 13% పెరిగినట్లు తెలుస్తోంది.

టయోటా కంపెనీకి చెందిన గ్లాంజా 3,212 కార్ల సేల్స్ జరగగా గత ఏడాది 4,596 యూనిట్లు విక్రయించింది. దీంతో 30% క్షీణించిన అమ్మకాలు నమోదు అయ్యాయి. ఇదే కంపెనీకి చెందిన అల్ట్రోజ్ కారును ఫిబ్రవరి నెలలో 2,063 మంది కొనుగోలు చేయగా.. 2025లో 1,604 యూనిట్ల సేల్స్ జరిగింది. దీంతో 29 శాతం అమ్మకాలు తగ్గినట్టు తెలుస్తోంది. చివరగా మారుతి కంపెనీకి చెందిన ఇగ్నీస్ కారును ఫిబ్రవరి నెలలో 1,848 మంది వినియోగదారులు కొనుగోలు చేయగా.. పోలిస్తే 23% అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper