Maruti Suzuki E Vitara
Maruti Suzuki E Vitara : భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మారుతి సుజుకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన E విటారా టీజర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ ఎలక్ట్రిక్ SUV త్వరలోనే భారతీయ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే, కంపెనీ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనప్పటికీ రిలీజ్‌కు ముందే ఈ కారులో ఉండే అద్భుతమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Also Read : టెస్టింగ్ సమయంలో కెమెరా కంట పడ్డ మారుతి నయా మోడల్స్ ఇవే
మారుతి సుజుకి ఈ E విటారాను తమ ప్రీమియం రిటైల్ ఛానల్ అయిన NEXA ద్వారా విక్రయించనుంది. NEXA ఎక్స్‌పీరియన్స్ వెబ్‌సైట్‌లో ఈ కారు విశేషాల గురించి ఇప్పటికే కొంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఈ E విటారాను లేటెస్ట్ టెక్నాలజీ, ఎట్రాక్టివ్ డిజైన్ తో వస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ SUV R18 అల్లాయ్ వీల్స్‌తో రాబోతుంది. బ్యాటరీ, డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే.. ఇందులో పవర్ ఫుల్ 61kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చనున్నారు. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, కేవలం 80 శాతం ఛార్జ్‌తోనే ఈ కారు 400 కిలోమీటర్ల దూరం వెళ్లగలగడం విశేషం. ఇది నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా, లాంగ్ డ్రైవ్స్‌కు కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ ధీమాగా చెబుతుంది.
ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. మారుతి సుజుకి E విటారా ప్రీమియం సెగ్మెంట్‌లోని ఇతర ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీనిచ్చేలా అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉండనుంది. ఇందులో ముఖ్యంగా వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ఇది ప్రయాణంలో మొబైల్ ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే, 10.25 ఇంచుల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. క్యాబిన్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. వేసవిలో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వెంటిలేటెడ్ సీట్లు అందించనున్నారు. విశాలమైన అనుభూతి కోసం పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. డ్రైవర్ సీటును 10 విధాలుగా పవర్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనుక సీట్లు కూడా స్లైడింగ్, రీక్లైనింగ్ ఫంక్షన్‌తో రాబోతున్నాయి.
సేఫ్టీ విషయానికి వస్తే.. మారుతి సుజుకి ఎక్కడా రాజీ పడలేదు. ఈ ఎలక్ట్రిక్ SUV ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) లెవెల్ 2 వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఇది డ్రైవింగ్‌ను సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. దీనితో పాటు అనేక ఇతర అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ ద్వారా కారు స్టేటస్, అలర్ట్‌లను తెలుసుకోవచ్చు. అలాగే, సుజుకి నావిగేషన్ సిస్టమ్ సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ల సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం మారుతి సుజుకి ఈ ఎలక్ట్రిక్ SUVని రూ.16 లక్షల నుంచి రూ.21 లక్షల మధ్య విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ధరల శ్రేణిలో ఇది టాటా కర్వ్ ఎలక్ట్రిక్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లకు గట్టి పోటీనివ్వగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.E విటారా విడుదల భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో ఒక కీలక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు.
Also Read : కార్ల బుకింగ్స్ కు తత్కాల్ స్కీం.. 35ఏళ్ల క్రితమే దేశంలో అమలు.. దాని స్పెషాలిటీ ఏంటంటే ?