Maruti Suzuki Cervo 2026: మార్కెట్లోకి Maruti Suzuki కార్లు వస్తున్నాయంటే కొందరికి పండుగ వాతావరణంలా ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీకి చెందిన కార్లు తక్కువ ధరలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రీమియం కార్లు కొనాలనుకునే వారికి కూడా ఈ కంపెనీ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా మారుతి సుజుకి Cervo మార్కెట్లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండి ఆకర్షణీయంగా మారింది. ఇది చిన్న కుటుంబాలతోపాటు ద్విచక్ర వాహనం నుంచి ఫోర్ వీలర్ కు మారేవారికి తక్కువ ధరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కారు డిజైన్ ఎలా ఉంది? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో మార్కెట్లోకి రాబోతున్న మారుతి సుజుకి Cervo మిగతా కార్ల కంటే డిజైన్ అద్భుతం అని చెప్పవచ్చు. ఇది పొడవైన క్యాబిన్ ను కలిగి ఉంది. అలాగే వెడల్పు గల డోర్ ఓపెనింగ్ ఉండడంతో కుటుంబ సభ్యులు ఇన్ అవుట్ కు అనుగుణంగా ఉంటుంది. అలాగే దీని మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్నర్ లో కూడా ఆకర్షణీయమైన క్యాబిన్ ఉండడంతోపాటు సౌకర్యవంతమైన సీట్లు ఉండనున్నాయి. చిన్న కుటుంబానికి అనుగుణంగా, స్టైలిష్ గా ఉండాలంటే ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
ఇందులో ఇంజన్ పనితీరు కూడా ప్రత్యేకంగానే ఉంది. ఈ కారులో పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది లీటర్ ఇందరానికి 22 నుంచి 26 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. బడ్జెట్లో కారు కొనాలని వారికి ఇంధన పొదుపు కోసం చూసేవారికి ఈ కారు చాలా అవసరం. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగం వెళ్లే ఈ కారు దూర ప్రయాణాలకు కూడా అనుగుణంగా ఉంటుంది. అలాగే నగరంలో ట్రాఫిక్ నుంచి బయటపడడానికి అనుకూలంగా ఇందులో స్పీడ్ బ్రేకర్స్, కంఫర్ట్ ఓరియంటెడ్ ఫీచర్లో ఉన్నాయి. కార్యాలయ అవసరాలకు ఉపయోగించే విధంగా డ్రైవర్లు అలసిపోకుండా ఉండడానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి.
ఈ కారు ఇన్నర్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పవర్ స్టీరింగ్, ఫ్రంటు పవర్ విండోస్, వేరియంట్ ను బట్టి మాన్యువల్ లేదా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఎయిర్ కండిషన్ వంటి ప్రైమరీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే సేఫ్టీ విషయానికి వస్తే బాడీ స్ట్రక్చర్, EBD తో కూడిన ABS , రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వంటివి సెక్యూరిటీని ఇస్తాయి. లాంగ్ జర్నీ చేసే వారికి అవసరమైన బ్రేకింగ్ సిస్టం కూడా భద్రతను కల్పిస్తుంది.
కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి ఈ కారు ద్వారా అందుబాటులో ఉంది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ.4.5 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అలాగే ఒకేసారి మొత్తాన్ని చెల్లించకుండా.. డౌన్ పేమెంట్ ను బట్టి కారును కొనుగోలు చేయవచ్చు. 2026 కొత్త సంవత్సరంలో బడ్జెట్ కారు కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.