Maruti Suzuki Celerio: దేశంలో కొత్తగా కారు కొనాలని అనుకునేవారిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు. కరోనా కాలం తరువాత చాలా మంది ఈ వర్గానికి చెందిన వారు సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో లో బడ్జెట్ కార్ల వైపు ఎక్కువగా చూస్తున్నారు. ఇదే సమయంలో మంచి మైలేజ్ ఉండాలని అనుకుంటారు. వీరి కోసం మారుతి కంపెనీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు తక్కువ ధరకే వినియోగదారులకు అందించి ఆకట్టుకుంది. ఇప్పుడు మరో కారును కూడా లో బడ్జెట్ లో అందిస్తుంది. అయితే ఈ కారు లీటర్ కు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండడంతో వినియోదారులు ఈ కారుపై ఎక్కువగా ఆసక్తిని పెంచుకుంటున్నారు. అందుకే గత ఏడాది కంటే ఈ ఏడాదిలో దీని వార్షిక వద్ధి రేటు 7 శాతం పెరిగింది. అంతేకాకుండా డిమాండ్ ఎక్కువగా ఉన్న హ్యాచ్ బ్యాక్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇంతకీ ఈ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
మారుతి నుంచి ఏ కొత్త కారు వచ్చినా.. దానిపై ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అయితే ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఓ కారు ఇప్పుడు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. అదే మారుతి సుజుకీ సెలెరియా. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో లో బడ్జెట్ కు అందుబాటులోఉండే ఈ కారును 2024 నవంబర్ లో 2,379 మంది కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే నెలలో 2,215 యూనిట్లు అమ్ముుడుపోయాయి. ఏడాది వార్షిక వృద్ధి రేటు 7 శాతం ఉండడంతో దీనిపై ఆశలు పెరిగాయి. అయితే ఈ ఏడాది అత్యధికంగా డిమాండ్ ఉన్న హ్యాచ్ బ్యాక్ కార్లలో సెలెరియో నిలిచింది.
మారుతి సెలెరియో ఇంజిన్ 1.2 లటర్ పెట్రోల్ తో కలిగి ఉంది. ఇది 67 బీహెచ్ పీ పవర్, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే ఈ కారు సీఎన్ జీ వెర్షన్ లో కూడా పనిచేస్తుంది. ఇది 57 బీహెచ్ పీ పవర్, 82 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ కారు సీఎన్ జీ వెర్షన్ లో 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
సెలెరియో కారు ఫీచర్స్ విషయానికొస్తే.. ఫుష్ బటన్ , 7 అంగుళాల టచ్ స్క్రీన్, మాన్యువల్ ఏసీ, కీలెస్ ఎంట్రీ ఆప్షన్లు ఉన్నాయి. సేప్టీ విషయంలో ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్, ఈబీడీ తో కూడిన సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇది గ్లిస్టనింగ్ గ్రే, ఆర్కిటిక్ వైట్ , బ్లూయిష్ బ్లాక్ వంటి కలర్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సెలెరియోను రూ. 5.37 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ వేరియంట్ రూ.7.04 లక్షల తో విక్రయించనున్నారు.