https://oktelugu.com/

Maruthi Suzuki Cars: సేప్టీలో జీరో రేటింగ్.. అయినా టాప్ 10 అమ్మకాలు.. ఆ కార్లు ఏవో తెలుసా?

సామాన్యులు ఎక్కువగా కొనుకునే కారు మారుతి ఆల్టో కే 10. ఇది గత ఏడాదిలో 1,11, 955 యూనిట్లు అమ్ముడు పోయింది. ఆల్టో కే 10 భద్రతా విషయంలో 2 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. పిల్లల భద్రత విషయంలో జీరో రేటింగ్ వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 17, 2024 / 01:42 PM IST

    Maruthi no safety cars

    Follow us on

    Maruthi Suzuki Cars: కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. నేటి కాలంలో ప్రతీ కుటుంబం ఓ వెహికల్ ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని కార్ల కంపెనీలు వీరికి అనుగుణంగా కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఎన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చినా మారుతి కంపెనీకి చెందిన కార్లపై క్రేజ్ తగ్గడం లేదు. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మారుతి కంపెనీకి చెందిన 3 నుంచి 4 మోడళ్లు టాప్ 10 లో చోటు సంపాదించుకుంటున్నాయి. కానీ సేప్టీ లో మాత్రం ఇవి జీరో రేటింగ్ ను పొందాయి. అయినా వీటిని జనాలు ఎందుకు కోరుకుంటున్నారు? వీటిల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటీ?

    మారుతి నుంచి రిలీజ్ అయిన కార్లలో వ్యాగన్ ఆర్, స్విప్ట్, ఆల్టో కే 10 కార్లు ది బెస్ట్ మోడళ్లుగా పేరొందాయి. వీటిలో వ్యాగన్ ఆర్ 2024 ఫిబ్రవరిలోనూ టాప్10 మోడళ్లలో చోటు సంపాదించుకుంది. వ్యాగన్ ఆర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 5 స్పీడ్ ఏఎంటీని కలిగి ఉంది. 7 అంగుళాల స్మార్ట్ డిస్ ఫ్లే ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు పోర్టబుల్, మౌంటెడ్ కంట్రోల్ తో కూడిన స్టీరింగ్ ఉన్నాయి. 2019లో రిలీజ్ అయిన ఈ కారు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలు విక్రయించుకుంది. అయితే ఇందులో సేప్టీ ఫీచర్స్ తక్కువే అని చెప్పాలి. ఇది గ్లోబల్ క్రాష్ టెస్ట్ లో 1 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. కానీ ఇందులో ఉండే ఫీచర్స్ కు కనెక్ట్ కావడంతో వీటి అమ్మకాలు పెరిగాయని చెప్పవచ్చు.

    మారుతి నుంచి వచ్చిన మరో బెస్ట్ కారు స్విప్ట్. ఇది కూడా రెండేళ్ల కిందట మార్కెట్లోకి వచ్చినా ఇప్పటికీ అమ్మకాలు టాప్ లోనే ఉన్నాయి. వ్యాగన్ ఆర్ తరువాత అత్యధికంగా అమ్ముడు పోతున్న స్విప్ట్ ను 2023-2024 ఏడాదిలో 1,95, 312 మంది సొంతం చేసుకున్నారు. ఇది త్వరలో లేటేస్ట్ టెక్నాలజీతో నెక్ట్స్ జనరేషన్ మోడల్ గా రాబోతుంది. ఈ కారు సైతం గ్లోబల్ క్రాష్ టెస్ట్ లో 1 రేటింగ్ మాత్రమే పొందింది. ఈ మోడల్ రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారు 22.59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కానీ లో బడ్జెట్ తో పాటు మైలేజ్ ఎక్కువగా ఉండడంతో దీనిని లైక్ చేస్తున్నారు.

    సామాన్యులు ఎక్కువగా కొనుకునే కారు మారుతి ఆల్టో కే 10. ఇది గత ఏడాదిలో 1,11, 955 యూనిట్లు అమ్ముడు పోయింది. ఆల్టో కే 10 భద్రతా విషయంలో 2 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. పిల్లల భద్రత విషయంలో జీరో రేటింగ్ వచ్చింది. అయితే దీనిని రూ.3.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది లీటర్ కు 24.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. భద్రతా విషయం పక్కనబెడితే సామాన్యులకు ఇది బెస్ట్ మోడల్ గా నిలిచింది. దీంతో వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.