Maruti Celerio : భారత వాహన తయారీ రంగం దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తోంది. దేశంలో ఎన్నో కంపెనీల కార్లు ఉండగా.. ఎక్కువ శాతం మంది మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌నే కొనుగోలు చేస్తుంటారు. మారుతీ సుజుకీ కారు చాలా కుటుంబాల్లో ఒక వ్యక్తిలా మారిపోయింది. 1999 డిసెంబర్ 18న మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారు మార్కెట్లోకి వచ్చింది. దశాబ్దాలు అవుతున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు డిమాండ్ తగ్గలేదు. మిగతా కంపెనీల కార్ల డిమాండ్ తగ్గింది.. కానీ మారుతీ సుజుకీ మాత్రం దేశంలో జెట్ స్పీడ్‌లో ప్రయాణిస్తోంది. అయితే మారుతి సుజుకీ తాజాగా సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను దేశంలో చేసింది. దీని ప్రారంభ కేవలం ధర రూ .4.99 లక్షలు మాత్రమే. అయితే ఈ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ రూ .11,000 విలువైన ఉచిత కాంప్లిమెంటరీ యాక్సెసరీస్‌తో మార్కెట్‌లోకి వస్తోంది.
కొత్తగా లాంచ్ చేసిన మారుతి సుజుకీ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ వినియోగదారులకు బెస్ట్ ఆఫర్. ఇయర్ ఎండ్‌లో భాగంగా కంపెనీ ఈ ఆఫర్‌కు ఇస్తోంది. ఎవరైనా కారు తక్కువ రేటులో కొనుగోలు చేయాలంటే ఇది తీసుకోవడం బెస్ట్. ఇందులో ఎక్స్టీరియర్ బాడీ కిట్, క్రోమ్ యాక్సెంట్లతో ఉన్న సైడ్ మౌల్డింగ్, రూఫ్ స్పాయిలర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే వాహనం లోపల క్యాబిన్‌లో డ్యూయల్ టోన్ డోర్ సిల్ గార్డులు, స్టైలిష్ ఫ్లోర్ మ్యాట్‌లు కూడా ఉన్నాయి. ఈ మారుతి సుజుకీ సెలెరియోలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ నావిగేషన్ సామర్థ్యాలు ఉన్నాయి. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో ఇవి వస్తాయి. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్‌లో ఇవి అనుకూలంగా ఉంటాయి. అలాగే హ్యాచ్ బ్యాక్‌లో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ మెకానిజం ఎబిఎస్ విత్ ఇబిడి, ఇఎస్పి, వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
మారుతి సుజుకీ సెలెరియో మెకానికల్‌లో స్పెసిఫికేషన్లు పెద్దగా ఎలాంటి మార్పు లేదు. ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్‌లో 1.0-లీటర్ మూడు సిలిండర్ల కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 66 బిహెచ్ పి పవర్‌ను ఉత్పత్తి చేయంతో పాటు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో పాటు ఏఎమ్టీ లభిస్తుంది. సెలెరియాలో ఎక్కువ ఇంధన సామర్థ్యం వస్తుంది. మార్కెట్లో ఉన్న వాహనాలతో పోలిస్తే ఇందులో అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. పెట్రోల్-మాన్యువల్ వేరియంట్‌తో లీటరుకు 25.24 కిలోమీటర్లు, పెట్రోల్-ఏఎమ్ టీ ఆప్షన్ తో లీటరుకు 26.68 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇంకా అదనంగా సెలెరియో సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.