Maruti Cars: భారతీయ ఆటోమోబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ ఎప్పటికీ నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను ఆకర్షించాయి. వీటిలో స్విప్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో తదితర కార్లు ఇప్పటికీ విక్రయాలు జరుపుకుంటున్నాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా వ్యాగన్ ఆర్ అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. అలాగే 2023 ఏడాది పొడవునా ఈ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కానీ ఒక్కసారిగా ఈ కారు అమ్మకాల్లో క్షీణత మొదలైంది. గతేడాది డిసెంబర్లో టాప్ 10 లోకి పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగింది. అసలేం జరిగిందంటే?
మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కు ఎప్పటపికీ డిమాండ్ ఉంటూ వస్తోంది. ఈ మోడల్ 1.0 , 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను కలిగి ఉంది. అలాగే 1.0 ఇంజిన్ ఉన్న మోడల్ లో సీఎన్ జీ కూడా ఉంది. 1.2 లీటర్ మోడల్ 88.5 బీహెచ్ పీ వపర్ తో పాటు 113 ఎన్ ఎం శక్తిని అందిస్తుంది. 25 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే వ్యాగన్ ఆర్ సీఎన్ జీలో 35 కిలోమీటర్ల మైలేజ్ వరకు దూసుకెళ్తుంది. వీటితో పాటు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి పీచర్లు ఆకర్షిస్తున్నాయి.
ఇండియాలో మారుతి వ్యాగన్ ఆర్ ను 5.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇవి నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. మారుతి వ్యాగన్ ఆర్ హ్యాచ్ బ్యాక్ కు ఎక్కువ.. ఎస్ యూవీకి తక్కువ అన్నట్లుగా ఉంటుంది. ఇది గత డిసెంబర్ లో 9,692 యూనిట్లు అమ్మారు. దీని కంటేఖరీదైన డిజైర్ కాంపాక్ట్ 14,012 యూనిట్లు విక్రయించారు. అలాగే 7 సీటర్ ఎర్టిగా 12,975 యూనిట్లు అమ్మారు. అలాగే బాలెనో 10, 669 విక్రయించారు. వీటి ధరలు రూ.7 లక్షలకు పైగానే ఉన్నాయి.
కానీ మారుతి వ్యాగర్ ఆర్ ధర తక్కువ అయినా కేవలం 10 వేల లోపు మాత్రమే విక్రయాలు జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2023 ఏడాది వ్యాప్తంగా మారుతి కంపెనీకి చెందిన స్విప్ట్ తరువాత వ్యాగన్ ఆర్ 2వ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు 10వ స్థానానికి పడిపోవడంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం కార్ల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వ్యాగన్ ఆర్ అమ్మకాలు ఉపందుకుంటాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది.