https://oktelugu.com/

Maruthi Wagan R : హైదరాబాద్ లో వ్యాగన్ ఆర్ ధర ఎంతో తెలుసా?

తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ను కలిగిన వ్యాగన్ ఆర్ ఆ కోవలో ఉండడంతో ఆ కారుకు డిమాండ్ పెరిగి అమ్మకాలు జరుపుకుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో వ్యాగన్ ఆర్ ధర ఎంతో?

Written By:
  • Srinivas
  • , Updated On : March 5, 2024 / 09:02 AM IST

    Wagan R In Hyderabad

    Follow us on

    Maruthi Wagan R : దేశీయ కార్ల మార్కెట్లో మారుతి కంపెనీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా వ్యాగన్ ఆర్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా వ్యాగన్ ఆర్ మిగతా వాటికి గట్టి పోటీ ఇస్తోంది. 2024 ఫిబ్రవరి నెలలోనూ వ్యాగన్ ఆర్ ఏమాత్రం తీసిపోకుండా అత్యధిక అమ్మకాలు జరుపుకుంది. కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాలకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో ఆ వేరియంట్ లో వ్యాగన్ ఆర్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ను కలిగిన వ్యాగన్ ఆర్ ఆ కోవలో ఉండడంతో ఆ కారుకు డిమాండ్ పెరిగి అమ్మకాలు జరుపుకుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో వ్యాగన్ ఆర్ ధర ఎంతో?

    కార్లు కొనాలనుకునేవారు ఎక్కువగా మారుతి కంపెనీ వైపే ఫోకస్ చేస్తారు. మరీ ముఖ్యంగా వ్యాగన్ ఆర్ కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలో కాంపాక్ట్ ఎస్ యూవీ కారు కొనాలనుకునేవారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్. అందుకే దీనికి ఆదరణ తగ్గడం లేదు. 2024 ఫిబ్రవరిలో వ్యాగన్ ఆర్ మొత్తం 1,97,471 యూనిట్లతో సంచలనం సృష్టించింది. వీటిలో దేశీయంగా 1,63,397 వాహనాలు అమ్ముడు పోయాయి.

    వ్యాగన్ ఆర్ కు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో దీని ధరల్లో తేడా ఉంది. ఎక్స్ షో రూం ఒకటే అయినప్పటికీ ఆన్ రోడ్ విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. సాధారణంగా ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.56 లక్షలతో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో దీనిని కొనుగోలు చేయాలంటే మాత్రం రూ.8 లక్షలకు వరకు చెల్లించాలి. అంటే వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయని గుర్తించాలి.

    వ్యాగన్ ఆర్ LXI ధర విషయానికొస్తే ఇది ఆన్ రోడ్ కు వచ్చే సరికి రూ.6.52 లక్షలు అవుతుంది. VXI రూ.7.04 లక్షలు, ZXIరూ.7.43 లక్షలు, LXI CNG రూ.7.57 లక్షలు చెల్లించాలి. మొత్తంగా హైదరాబాద్ లో వ్యాగర్ ఆర్ కు సంబంధించిన కారు కొనుగోలు చేయాలంటే రూ.6.52 లక్షల నుంచి రూ.8.75 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. అయితే వ్యాగర్ ఆర్ లో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంది.