మనస్సుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. మంగళూరుకు చెందిన కిరణా దేవాదిగ అనే మహిళ తన తెలివితేటలతో లక్షల్లో సంపాదిస్తున్నారు. మిద్దెతోటలో పూల సాగు చేస్తూ ఈ మహిళ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుండటం గమనార్హం. శంకరపుర మల్లిగే అనే పేరుతో పిలవబడే మల్లెలను ఈ మహిళ పెంచడం ప్రారంభించారు. ఈ మల్లె ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి.
కిరణా దేవాదిగ మిద్దెతోటలో మల్లెపూలను సాగు చేయడం గురించి మాట్లాడుతూ దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఈ మల్లెపూలు పెరుగుతాయని చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు వ్యవసాయం చేయాలనే కోరిక ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. మొదట 90 మొక్కలను 100 కుండీలను ఈ మహిళ కొనుగోలు చేశారు. పలువురి సలహాలు, సూచనలు తీసుకుని ఎర్రమట్టి, నల్లమట్టి, సేంద్రియ ఎరువును సమపాళ్లలో కలిపి మహిళ మొక్కలు పెంచే పనిని మొదలుపెట్టారు.
నర్సరీ యజమాని సాయంతో మొక్కలు నాటడంలో మెలుకువలను నేర్చుకున్నానని మూడు నెలల తర్వాత మొక్కలు పూలు పూశాయని ఆమె అన్నారు. నిత్యం ఒక పద్ధతి ప్రకారం మొక్కలను పెంచాల్సి ఉంటుందని మొదట తనను ఎగతాళి చేసిన వాళ్లే తనతో కలిసి పని చేస్తున్నారని ఆమె అన్నారు. మల్లెలను కూడా సాగు చేయడం తాను మొదలుపెట్టానని మహిళ చెప్పుకొచ్చారు.
12,000 రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టామని పూలు అమ్మడం ద్వారా ఇప్పటివరకు 85,000 రూపాయలు సంపాదించామని ఆమె అన్నారు. గార్డెనింగ్‌లోనే తాను రోజులో ఎక్కువ సమయం గడుపుతానని టెర్రస్ గార్డెనింగ్ లో కలిగే ఆనందం ఎందులోనూ కలగదని ఆమె అన్నారు. టెర్రస్ గార్డెనింగ్ ను చూసుకోవడంలో వచ్చే ఆనందం వేరే వాటిలో కలగదని కిరాణా దేవాదిగ తెలిపారు.